H.O.G (Harley Owners Group) డిసెంబర్ లో భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సాహసయాత్రకు నయారా పెట్రోకెమికల్ కంపెనీ భాగస్వామిగా నిలిచింది… ఇందనం అందించింది. 

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ రోడ్లు వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలను, సంస్కృతులను, నగరాలను అనుసంధానిస్తాయి. చాలా మంది రైడర్స్ కి వీటిని అనుభవించడానికి మోటార్‌సైకిల్ ప్రయాణమే అత్యుత్తమ మార్గం. దేశంలోని రహదారులు విస్తృతమైనవి, సవాలుతో కూడుకున్నవి... స్వేచ్ఛను కోరుకునే వారికి ఇవి గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఇదే స్ఫూర్తితో రైడర్లందరూ 'ఇండియా H.O.G.™ ర్యాలీ 2025'లో ఒకచోట చేరారు. ఇది హై-పెర్ఫార్మెన్స్ బైక్‌లపై లాంగ్-డిస్టెన్స్ టూరింగ్, సోదరభావం, ఫ్యాషన్ కు ఒక నిదర్శనం.

నాగ్‌పూర్‌కు చెందిన 'ఎపిసెంటర్ H.O.G. చాప్టర్', రాయ్‌పూర్‌కు చెందిన 'ఐరన్ ఓర్ H.O.G. చాప్టర్' ఆతిథ్యం ఇచ్చిన ఈ రెండు రోజుల ర్యాలీ డిసెంబర్‌లో జరిగింది. భారత దేశవ్యాప్తంగా ఉన్న హార్లే-డేవిడ్సన్® రైడర్లు మోర్జిమ్‌లోని 'ఫర్జీ బీచ్'లో తమ ప్రయాణ జ్ఞాపకాలను, వారసత్వాన్ని జరుపుకోవడానికి తరలివచ్చారు.

అంతర్జాతీయ స్థాయి ఇండియన్ ఇంటిగ్రేటెడ్ డౌన్‌స్ట్రీమ్ ఎనర్జీ, పెట్రోకెమికల్ కంపెనీలలో ఒకటైన నయారా ఎనర్జీ (Nayara Energy) ఈ ప్రతిష్ఠాత్మక ర్యాలీకి 'ఫ్యూయలింగ్ పార్ట్నర్' (Fuelling Partner) గా సహకారం అందించింది. రిఫైనింగ్ నుండి రిటైల్ వరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ వాడినార్‌లో 20 MMTPA సామర్థ్యం కలిగిన భారతదేశపు రెండవ అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనరీని కలిగిన నయారా ఎనర్జీ ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా విశ్వసనీయమైన ఇంధనాన్ని అందించడంలో తన నిబద్ధతను చాటుకుంది.

దేశవ్యాప్తంగా ఉన్న రైడర్లు తమ హార్లే-డేవిడ్సన్® మోటార్‌సైకిళ్లపై గోవా చేరుకోవడానికి సుదీర్ఘ రహదారులను అధిగమించారు. ఈ ప్రయాణంలో వారు నయారా ఎనర్జీ అవుట్‌లెట్‌లలో ఇంధనాన్ని నింపుకున్నారు. భారతదేశపు ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో దాదాపు 7% వాటాను కలిగి 6,500 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది నయారా. దీంతో ప్రధాన రహదారులపై నయారా ఎనర్జీ స్టేషన్‌లను కనుగొనడం సులభతరమైంది. ఈ ప్రచారంలో భాగంగా రైడర్లు నిర్ణీత చెక్‌పాయింట్ల వద్ద ప్రత్యేకమైన 'ఎనర్జీ కిట్' (Energy Kit) బహుమతులను కూడా అందుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే రైడర్లు మార్గమధ్యలో ఏదైనా నయారా ఎనర్జీ ఫ్యూయల్ స్టేషన్ వద్ద దిగిన ఫోటోను షేర్ చేయడం ద్వారా ఇండియా H.O.G.™ ర్యాలీ 2025 వద్ద తమ కిట్‌లను పొందారు.

సుదూర ప్రయాణాలు చేసే రైడర్లకు విశ్వసనీయత చాలా ముఖ్యం, ఇందులో ఇంధన నాణ్యత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లకు స్థిరమైన పనితీరును అందించే, ఇంజిన్ రక్షణను ఇచ్చే, రహదారులపై నమ్మకాన్ని కలిగించే ఇంధనం అవసరం. భారతదేశపు మారుతున్న హైవే పర్యావరణ వ్యవస్థలో నాణ్యమైన ఇంధనం పనితీరును ఎలా పెంచుతుందో ఈ సహకారం హైలైట్ చేస్తుంది.

ఈ ర్యాలీ ముగిసినప్పటికీ కొత్త రోడ్లు, మారుతున్న ప్రకృతి దృశ్యాల గుండా ప్రయాణాలు కొనసాగుతూనే ఉంటాయి. నిరంతరం ముందుకు సాగే రైడర్ల ఉత్సాహం, నాణ్యమైన ఇంధనం, దేశవ్యాప్త నెట్‌వర్క్ పట్ల నయారా ఎనర్జీకి ఉన్న నిబద్ధత ఈ ప్రయాణాలకు వెన్నెముకగా నిలుస్తాయి.