OPPO Reno16: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది ఒప్పో రెనో16 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడూ ప్రయాణాల్లో, క్యాంపస్‌లో, ఆఫీస్‌లో, కేఫ్‌లలో, ట్రావెల్‌లో లేదా కంటెంట్ క్రియేషన్‌లో బిజీగా ఉండే.. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మానని ఈ తరం వారిని దృష్టిలో పెట్టుకొని ఒప్పో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. అత్యాధునిక డిజైన్, వినూత్న సాంకేతికతకు పేరుగాంచిన OPPO Reno సిరీస్.. Gen Z ఆలోచనా విధానానికి పూర్తిగా సరిపోయేలా రూపొందించారు. జూలై 9న ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో16, ఒప్పో రెనో 16సీ అనే రెండు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

డిజైన్‌లో వినూత్నత, అత్యుత్తమ పనితీరు, నమ్మకమైన బ్యాటరీ లైఫ్‌తో ఒప్పో రెనో సిరీస్‌కు ఉన్న గుర్తింపును కొనసాగిస్తూ.. ఈ రెండు కొత్త ఫోన్లు అత్యాధునిక కెమెరా సామర్థ్యాలతో పాటు అడ్వాన్స్డ్ AI ఫీచర్లను అందిస్తున్నాయి. ఒప్పో రెనో16 జూలై 9 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని ధర 8GB + 256GB వేరియంట్ రూ. 61,999, 12GB + 256GB వేరియంట్‌కు రూ. 67,999గా నిర్ణయించారు. ఒప్పో రెనో16సీ ధర 8GB + 128GB వేరియంట్‌కు రూ. 46,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 49,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 55,999గా నిర్ణయించారు.

కాస్మిక్ ప్రేరణతో డిజైన్: అత్యాధునిక సాంకేతికతకు స్టైలిష్ లుక్
కెమెరా ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, డిజైన్ పరంగా కూడా OPPO Reno16 సిరీస్ కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. భారత్‌లో తొలిసారిగా ఒప్పో.. రెనో16, రెనో 16సీ మోడళ్లలో 3D పాప్ ప్లాంట్ డిజైన్ను HoloVerse 3D టెక్నాలజీతో పరిచయం చేసింది.
3D Pop Planet డిజైన్‌లో వెనుక భాగంలో తేలియాడుతున్న గ్రహంలా కనిపించే ప్రత్యేక ఎఫెక్ట్ ఉంటుంది. దీనిపై పడే కాంతిని బట్టి నీడ సహజంగా కదులుతూ కనిపిస్తుంది. ఇది సాధారణ స్టిక్కర్ లేదా ప్రింట్ కాదు. ఫోన్‌ను ఏ కోణంలో చూసినా లోతైన 3D ఎఫెక్ట్‌తో సహజమైన నీడ కనిపించేలా రూపొందించారు. మూడు పొరల నిర్మాణంలో లక్షలాది సూక్ష్మ లెన్స్‌లను ఉపయోగించి ఈ ప్రత్యేక డిజైన్‌ను రూపొందించడం వల్ల Reno16 సిరీస్‌కు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.
OPPOకు ప్రత్యేకమైన అల్ట్రా-స్లిమ్ డిజైన్‌ను ఈ సిరీస్‌లో కూడా కొనసాగించారు. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, వన్-పీస్ కోల్డ్-స్కల్ప్టెడ్ డిజైన్‌తో ఈ ఫోన్లను రూపొందించారు. Reno16 మందం కేవలం 8.22 మి.మీ. కాగా, బరువు 182 గ్రాములు మాత్రమే. మరోవైపు కాంపాక్ట్ రెనో16c మందం 8.44 మి.మీ., బరువు 195 గ్రాములు మాత్రమే.
జేబులో సులభంగా పెట్టుకునేలా, చేతిలో సౌకర్యవంతంగా పట్టుకునేలా Reno16లో 6.32 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. కేవలం 1.66 మి.మీ. సన్నని బెజెల్స్ కారణంగా 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో లభిస్తుంది. దీంతో వీడియోలు చూడటం, గేమింగ్, కంటెంట్ క్రియేషన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. Reno16cలో 6.57 అంగుళాల డిస్‌ప్లే ఉంది. రెండు ఫోన్లలోనూ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా, టచ్ స్పందన వేగంగా ఉంటుంది.

మొదటిసారిగా OPPO Reno16 సిరీస్‌లో IP69K డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను అందించింది. దీనితో పాటు IP66, IP68, IP69 రేటింగ్‌లు కూడా ఉన్నాయి. నీరు, దుమ్ము, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఈ ఫోన్లు సులభంగా తట్టుకోగలవు.
ఇప్పటికే OPPO ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉన్న ఫిజికల్ AI Snap Keyను ఈ సిరీస్‌లో కొత్త హార్డ్‌వేర్ ఫీచర్‌గా చేర్చారు. దీని ద్వారా AI Mind Spaceను వెంటనే యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు, స్క్రీన్‌షాట్ తీయడం, వాయిస్ నోట్స్ రికార్డ్ చేయడం, కెమెరా, ఫ్లాష్‌లైట్ ఓపెన్ చేయడం, అనువాదాలకు సహాయపడటం వంటి పలు పనులకు ఈ బటన్‌ను వినియోగదారులు తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ సిరీస్ ట్విలైట్ వైలట్, స్టెల్లర్ పర్పుల్, స్టార్రీ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కలర్స్‌తో పాటు 3D Pop Planet డిజైన్ ఫోన్లకు మరింత ప్రత్యేకమైన ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.
ప్రయాణాల్లోనూ అద్భుతమైన ఫొటోలు, వ్లాగ్‌ల కోసం రూపొందించిన AI కెమెరా
OPPO Reno16 సిరీస్ కెమెరా వ్యవస్థను ఒక్క మాటలో చెప్పాలంటే సృజనాత్మకతకు కొత్త నిర్వచనం. అధునాతన AI టూల్స్‌తో ఈ సిరీస్ కొత్త తరం వినియోగదారులకు ఫొటోగ్రఫీ, వీడియోలలో మరింత సరదా, సృజనాత్మకతను అందిస్తుంది. OPPO Reno16, Reno16c రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రెండు మోడళ్లలో కూడా ముందు భాగంలో 50MP అల్ట్రా=వైడ్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉండటంతో సెల్ఫీలు, వ్లాగ్‌లు తీసేటప్పుడు స్నేహితులందరూ సులభంగా ఫ్రేమ్‌లోకి వస్తారు. OPPO Reno16 వెనుక భాగంలో 50MP అల్ట్రా క్లీనర్ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. Reno16cలో 50MP Main Camera, 8MP Ultra-Wide కెమెరాను అందించారు. రెండు ఫోన్లలోనూ డ్యూయల్ ఫ్లాష్ సపోర్ట్ ఉంది.
ఈ రెండు ఫోన్లలో ప్రధాన ఆకర్షణ 3.5x టెలిఫొటో లెన్స్. ఇది విభిన్న రకాల ఫొటోలను అద్భుతంగా క్యాప్చర్ చేయగలదు. 1x లెన్స్ సహజమైన ఫ్రేమింగ్‌ను అందిస్తే, 3.5x టెలిఫోటో లెన్స్ దూరంలోని దృశ్యాలను, వ్యక్తులను సహజమైన చర్మ రంగులతో అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఈ లెన్స్‌లో AI ఆధారిత 120x Zoom సపోర్ట్ ఉంది. దీంతో మంచుతో కప్పుకున్న పర్వతాలు వంటి దూరంలోని దృశ్యాలను కూడా దగ్గరగా ఉన్నట్లుగా చిత్రీకరించవచ్చు. OPPO Reno16లో అన్ని కెమెరాలతో 4K HDR వీడియోలను 60fpsలో రికార్డ్ చేయొచ్చు. Reno16cలో 4K HDR వీడియోలను 30fpsలో రికార్డ్ చేసే సౌకర్యం ఉంది.

ఈ సిరీస్‌లో ఆటో స్ట్రెయిట్ ఇన్ 4K ఫీచర్ కూడా ఉంది. వీడియో తీసేటప్పుడు కెమెరా గరిష్ఠంగా 5 డిగ్రీల వరకు వంగినా, అది ఆటోమేటిక్‌గా సరిచేసి సూటిగా కనిపించేలా చేస్తుంది. నడుస్తూ వీడియోలు తీసే ట్రావెల్ వ్లాగర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గింబల్ అవసరం లేకుండానే సినిమాటిక్ క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయవచ్చు. Dual-View Video 2.0 ద్వారా ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియోలు చిత్రీకరించే అవకాశం కూడా ఉంది.
క్రియేటివిటీని పెంచే మూడు కొత్త AI ఫీచర్లు
ఈ సిరీస్‌లో మూడు కొత్త ఫీచర్లను OPPO అందించింది. Pop Cam ద్వారా తొమ్మిది రకాల రెట్రో-స్టైల్ ఫోటో మూడ్స్‌లో చిత్రాలను తీసుకోవచ్చు. AI Remix Collage ద్వారా సాధారణ ఫోటోలను ఆకర్షణీయమైన కొల్లాజ్‌లుగా మార్చుకోవచ్చు. ఫొటోలు, మోషన్ ఫొటోలు, వీడియోలలోని వ్యక్తులు లేదా వస్తువులను కట్ చేసి స్టిక్కర్లుగా మార్చి వాటితో ప్రత్యేకమైన కొల్లాజ్‌లు రూపొందించవచ్చు. వాటికి ఎఫెక్ట్స్, ఫాంట్లు, డూడుల్స్ జోడించి మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. Popout 2.0 ద్వారా మనుషులు, పెంపుడు జంతువులు, భవనాలు, వాహనాలు వంటి అంశాలను ఫొటోల నుంచి ప్రత్యేకంగా హైలైట్ చేసి ఆకట్టుకునే కొల్లాజ్‌లను రూపొందించవచ్చు.

కలర్OS 16, AIతో మరింత వేగవంతమైన అనుభవం
OPPO Reno16లో స్నాప్‌డ్రాన్ 7 Gen 4 Mobile Platform ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 6700mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. Reno16cలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పాటు 7000mAh బ్యాటరీ, 80W SUPERVOOC Flash Chargeను అందించారు. ఈ రెండు ఫోన్లు ColorOS 16పై పనిచేస్తాయి. ఇందులో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక AI ఫీచర్లు ఉన్నాయి.
AI మైండ్ స్పేస్
AI Snap Key ద్వారా వెంటనే యాక్సెస్ చేయగల AI Mind Space ఒక వ్యక్తిగత మెమరీ హబ్‌లా పనిచేస్తుంది. స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని స్క్రీన్‌షాట్‌లు సేవ్ చేయకుండా గుర్తించి, అవసరమైన వివరాలను ఆటోమేటిక్‌గా విశ్లేషించి క్రమబద్ధంగా భద్రపరుస్తుంది. ట్రిప్ ప్లానింగ్ నుంచి ఆఫీస్ ప్రెజెంటేషన్ వరకు అనేక పనుల్లో ఇది ఉపయోగపడుతుంది.
AI మైండ్ పైలట్
Google Gemini, Perplexity, ChatGPT వంటి AI ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మీ అవసరాలకు అనుగుణంగా సమాధానాలను రూపొందించి, వాటిని పోల్చి సరైనదాన్ని ఎంచుకునే అవకాశం AI Mind Pilot అందిస్తుంది.
AI బిల్ మేనేజర్
కాగితంపై ఉన్నా, డిజిటల్ బిల్ అయినా స్కాన్ చేసి ముఖ్యమైన సమాచారాన్ని గుర్తించి, స్థానిక కరెన్సీలో ఖర్చులను విశ్లేషిస్తుంది. డ్యాష్‌బోర్డ్ ద్వారా ఖర్చులను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.
AI మెను ట్రాన్స్‌లేషన్
విదేశాలకు వెళ్లినప్పుడు రెస్టారెంట్ మెనూ అర్థం కాకపోతే AI Menu Translation ఉపయోగపడుతుంది. ఆహారం వివరాలు, పదార్థాలు, చిత్రాలు మాత్రమే కాకుండా ధరలను కూడా ట్రాన్స్‌లేట్ చేసి చూపిస్తుంది.
ఏఐ స్కాన్, ఏఐ Extract
ఆఫీస్ పనులు, పరీక్షల సిద్ధతకు ఉపయోగపడే AI Scan, AI Extract ద్వారా మూడు సెకన్లలోపే పేజీలను స్కాన్ చేయొచ్చు. నీడలు, కాంతి ప్రతిబింబాలను తొలగించి, వంగిన పేజీలను కూడా సరిచేస్తుంది. అనంతరం వాటిని PDF, Word లేదా Image రూపంలో సేవ్ చేసుకోవచ్చు.

OPPO Bubble.. కేవలం యాక్సెసరీ కాదు.. స్టైల్ స్టేట్‌మెంట్
OPPO Reno16 సిరీస్‌తో పాటు OPPO Bubble అనే ప్రత్యేక గ్యాడ్జెట్‌ను కూడా కంపెనీ అందించింది. ఇది వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకునేందుకు ఉపయోగపడే ప్రత్యేక పరికరం. ఈ బబుల్ ఆకారంలోని యాక్సెసరీని ఫోన్‌కు అమర్చితే వెనుక కెమెరా ప్రీవ్యూను ప్రత్యక్షంగా చూడొచ్చు. దీంతో వెనుక కెమెరాతో సెల్ఫీ తీసేటప్పుడు ఎలా వస్తుందో ముందుగానే చూసుకుని సరైన పోజ్ ఇవ్వొచ్చు. ఇంకా ఇది 10 మీటర్ల దూరం వరకు రిమోట్ షట్టర్‌గా కూడా పనిచేస్తుంది.
OPPO Bubbleలో 1.73 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇందులో స్టిల్ ఫొటోలు, మోషన్ ఫొటోలు లేదా 5 సెకన్ల వరకు చిన్న వీడియోలు ప్రదర్శించవచ్చు. దీని బరువు కేవలం 27.5 గ్రాములు మాత్రమే. 560mAh బ్యాటరీ, 600 నిట్స్ మ్యాక్స్ బ్రైట్‌నెస్, మూడు బ్రైట్‌నెస్ స్థాయిలు ఉండటంతో బయట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే IP54 రేటింగ్‌తో దుమ్ము, తేలికపాటి వర్షం నుంచి రక్షణ లభిస్తుంది.

మొత్తంమీద.. OPPO Reno16, Reno16c స్మార్ట్‌ఫోన్లు Gen Zతో పాటు కొత్త తరం యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. HoloVerse 3D Technology, Triple AI Camera System, AI Remix Collage, Pop Cam వంటి ఫీచర్లు ఈ సిరీస్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అద్భుతమైన పనితీరు, ఎక్కువసేపు నిలిచే బ్యాటరీ, అధునాతన AI టూల్స్‌తో "Live in the Moment" అనే OPPO తత్వాన్ని ఈ సిరీస్ ప్రతిబింబిస్తోంది.
కొత్త OPPO Reno16 సిరీస్‌తో పాటు OPPO Bubble కూడా ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. OPPO Bubble ధర రూ. 7,999. ఈ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్లు, OPPO e-Store, Amazon, Flipkartద్వారా కొనుగోలు చేయవచ్చు.


