Laxmi Diwali Delights: చెఫ్ కునాల్ కపూర్‌తో కలిసి లక్ష్మి సంస్థ ‘దివాళీ డిలైట్స్’ సీజన్ 2 యూట్యూబ్ సిరీస్‌ను తెచ్చింది. అలాగే లగ్జరీ కారు, బంగారు నాణేలు గెలుచుకునే స్వీప్‌స్టేక్స్ ప్రకటించింది. ఆ వివరాలు మీకోసం.
Laxmi Diwali Delights: ఫెస్టివల్ సీజన్ తో ఉత్తర అమెరికాలోని ప్రతి ఇంటి వంటగది ఇప్పుడు రుచికరమైన వంటకాలు, కుటుంబ సభ్యుల సందడితో కళకళలాడేందుకు సిద్ధమవుతోంది. ఈ పండుగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఈ ఏడాది మరిన్ని కొత్త విశేషాలతో ముందుకొచ్చింది.
వరుసగా రెండో ఏడాది కూడా ప్రముఖ చెఫ్, ఎన్డీటీవీ ఫుడ్ అవార్డు విజేత చెఫ్ కునాల్ కపూర్‌తో లక్ష్మి సంస్థ చేతులు కలిపింది. వీరిద్దరి కాంబినేషన్లో ‘దివాళీ డిలైట్స్ విత్ లక్ష్మి ఫీచరింగ్ చెఫ్ కునాల్ కపూర్’ (https://www.youtube.com/watch?v=13-N3RLHRIc&list=PLB4YInZx4iL4&index=4) పేరుతో ఆరు ఎపిసోడ్ల ప్రత్యేక యూట్యూబ్ సిరీస్‌ను తీసుకువచ్చింది. నాణ్యమైన లక్ష్మి ఉత్పత్తులను ఉపయోగిస్తూ సులభంగా, ఎంతో రుచికరంగా చేసుకునే ఇండియన్ ఫ్యూజన్ వంటకాలతో ఈ సిరీస్ దీపావళి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
బిజీ లైఫ్‌కు తగ్గట్టుగా.. సంప్రదాయ రుచులకు మోడ్రన్ టచ్
గత ఏడాది ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ విజయంతో ఇప్పుడు చెఫ్ కునాల్ కపూర్ మరిన్ని సింపుల్ రెసిపీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మన పాత సంప్రదాయ దీపావళి రుచులకు నేటి తరానికి నచ్చే మోడ్రన్ ట్విస్ట్ ఇస్తూ ఈ వంటకాలను డిజైన్ చేశారు.
రోజూ ఆఫీసులు, పనులతో బిజీగా ఉండే కుటుంబాలు కూడా తమ వంటింట్లో చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. చేయడానికి ఈజీగా ఉంటూనే, పండుగ పూట ఇంటిల్లిపాదికీ ప్రత్యేకమైన విందు భోజనం తిన్న అనుభూతిని ఇచ్చేలా ప్రతి ఎపిసోడ్‌ను రూపొందించారు. సెప్టెంబర్ 9న ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ అయింది. దీనితో వంటలు చేస్తూ, పండుగ జరుపుకుంటూ కొత్త దీపావళి జ్ఞాపకాలను పోగేసుకునే సీజన్ అధికారికంగా మొదలైంది.

ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం: చెఫ్ కునాల్ కపూర్
ఈ భాగస్వామ్యంపై చెఫ్ కునాల్ కపూర్ తమ సంతోషాన్ని పంచుకున్నారు. "లక్ష్మి బ్రాండ్‌తో రెండో ఏడాది కూడా కలిసి పనిచేయడం నిజంగా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. దీపావళి అంటేనే అందరూ ఒకచోట చేరడం, మన సంప్రదాయాలను గౌరవించుకోవడం, మంచి ఆహారాన్ని ఆస్వాదించడం. లక్ష్మి స్వచ్ఛమైన ఉత్పత్తులతో ప్రతి కుటుంబం ఎంతో సులభంగా, క్రియేటివ్‌గా, ఆనందంగా ఈ పండుగ స్ఫూర్తిని పొందేలా మేము ఈ వంటకాలను అందిస్తున్నాం. ఎందుకంటే నాణ్యత, సంప్రదాయంతో పండుగ చేసుకోవాలంటే ‘లక్ష్మి హై నా!’" అని చెఫ్ కునాల్ కపూర్ పేర్కొన్నారు.
వంటకాలే కాదు.. లగ్జరీ కారు గెలుచుకునే క్రేజీ ఛాన్స్!
ఈసారి లక్ష్మి అందిస్తున్న పండుగ సంబరాలు కేవలం వంటగదికే పరిమితం కాలేదు. ఈ దీపావళికి ఒక ఖరీదైన లగ్జరీ కారు మీ ఇంటి ముందుకు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది న్యూజెర్సీకి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పోటీలో గ్రాండ్ ప్రైజ్ కారును గెలుచుకున్నారు (https://www.instagram.com/reel/DVMP7DaiK2O/).
ఈ ఏడాది అమెరికాలోని కుటుంబాలకు మరింత పెద్ద బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని లక్ష్మి కల్పిస్తోంది. ‘డ్రీమ్ బిగ్, విన్ బిగ్గర్ దిస్ ఫెస్టివల్!’ పేరుతో నిర్వహిస్తున్న దీపావళి స్వీప్స్టేక్స్లో (https://laxmihos.com/dream-big-win-bigger-this-festival) పాల్గొంటే మీరూ విజేత కావచ్చు.
ఇందులో లగ్జరీ కారుతో పాటు బంగారు నాణేలు, స్మార్ట్ఫోన్లు, టీవీలు ఇంకా మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీకు ఇష్టమైన లక్ష్మి ఉత్పత్తిని కొనుగోలు చేసి, స్వీప్స్టేక్స్లో ఎంట్రీ నమోదు చేయడమే. మీరు పండుగ విందు సిద్ధం చేస్తున్నా, చెఫ్ కునాల్ కొత్త రెసిపీ ట్రై చేస్తున్నా, లేదా సాధారణంగా లక్ష్మి సరుకులు కొంటున్నా ఈ సీజన్లో ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి.

50 ఏళ్ల నమ్మకం.. లక్ష్మీ టీమ్ ఏమందంటే?
గత ఏడాది విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గివ్అవేను మళ్లీ తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని లక్ష్మి టీమ్ తెలిపింది. "చెఫ్ కునాల్ కపూర్‌తో మరోసారి జతకట్టి ఈ గివ్అవే ప్రకటించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఉత్తర అమెరికా అంతటా ఉన్న కుటుంబాల దీపావళి వేడుకల్లో నాణ్యమైన లక్ష్మి ఉత్పత్తులతో చేసిన రుచికరమైన ఇండియన్ ఫ్యూజన్ వంటకాలను, ఆనందాన్ని నింపడానికి ఇది ఒక చక్కని మార్గం" అని లక్ష్మీ HOS గ్లోబల్ ఫుడ్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుహాసినీ పాటిల్ అన్నారు.
1972లో స్థాపించబడిన లక్ష్మి బ్రాండ్, గత ఐదు దశాబ్దాలుగా ఉత్తర అమెరికాలోని ఇళ్లకు అసలైన దక్షిణాసియా రుచులను అందిస్తోంది. స్వదేశపు రుచులను గుర్తుచేసే నాణ్యమైన పదార్థాలకు లక్ష్మి ఒక నమ్మకమైన చిరునామాగా నిలిచింది. అందుకే ఫెస్టీవల్ కు అందరూ కలిసి వంట చేయాలని, వేడుకలు జరుపుకోవాలని, పెద్ద కలలు కనాలని లక్ష్మి, చెఫ్ కునాల్ కపూర్ పిలుపునిస్తున్నారు.. ఎందుకంటే ‘లక్ష్మి హై నా!’
స్వీప్‌స్టేక్స్ రూల్స్.. ముఖ్య వివరాలు ఇవే
• ఈ పోటీలో పాల్గొనడానికి ఎటువంటి కొనుగోలు అవసరం లేదు.
• 50 అమెరికా రాష్ట్రాలు, డీసీలోని 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల చట్టబద్ధమైన నివాసితులు మాత్రమే అర్హులు.
• 50 యూఎస్ రాష్ట్రాలు/డీసీ వెలుపల, చట్టం నిషేధించిన చోట్ల ఇది చెల్లదు.
• ఈ పోటీ 09/01/26న ఉదయం 12:00:01 ETకి ప్రారంభమై, 12/31/26న రాత్రి 11:59:59 ETకి ముగుస్తుంది.
• అన్ని బహుమతుల మొత్తం విలువ $78,460. ప్రతి డ్రాకు వచ్చిన ఎంట్రీల సంఖ్య ఆధారంగా గెలిచే అవకాశాలు ఉంటాయి.
• ఒక వ్యక్తికి రోజుకు గరిష్ఠంగా పది ఎంట్రీలు మాత్రమే అనుమతి ఉంటుంది.
• పూర్తి అధికారిక రూల్స్ కోసం www.laxmihos.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• స్పాన్సర్: హౌస్ ఆఫ్ స్పైసెస్ ఇండియా ఇంక్. (House of Spices India Inc.), 3000 మార్కస్ అవెన్యూ, సూట్ 2W10, లేక్ సక్సెస్, NY 11042.
















