న్యూ ఢీల్లీ: మార్వెల్ ఎవెంజర్స్ స్ఫూర్తితో టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

టివిఎస్ ఎన్‌టార్క్ 125 ప్రత్యేక సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌ను పరిచయం చేయడానికి కంపెనీ డిస్నీ ఇండియా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ విభాగంతో కలిసి ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు టీవీఎస్‌ మోటర్‌ సంస్థ వెల్లడించింది.

also read టాటా కార్లపై దసరా ఫెస్టివల్ ఆఫర్.. బి‌ఎస్ 6 కార్లపై భారీగా డిస్కౌంట్.. ...

భారతదేశ మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ స్కూటర్‌ను ఆర్‌టి-ఎఫ్‌ఐ టెక్నాలజీతో వస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్‌ చిత్రం ‘ఎవెంజర్స్‌'ను స్ఫూర్తిగా తీసుకుని ఈ స్కూటర్‌ను రూపొందించింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125  సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ధర 77,865 రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).  గత సంవత్సరంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125  పోర్ట్‌ఫోలియోలో రేస్ ట్యూన్డ్ ఫ్యుయెల్ ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టింది.

సూపర్ స్క్వాడ్ ఎడిషన్ మూడు కొత్త రంగులలో అందుబాటులోకి రానుంది, ఇన్విన్సిబుల్ రెడ్, స్టీల్త్ బ్లాక్, కంబాట్ బ్లూ, ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా నుండి ప్రేరణ పొందాయి.