టాటా కార్లపై దసరా ఫెస్టివల్ ఆఫర్.. బిఎస్ 6 కార్లపై భారీగా డిస్కౌంట్..
కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆటోమొబైల్ తయారీదారులు కార్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఇందులో టాటా మోటార్స్ ముందుంది, టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మినహా మిగతా అన్నీ కార్ల మోడల్స్ పై 65,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
దేశంలో ఇప్పటికే పండుగ సీజన్ ప్రారంభంకావడంతో కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆటోమొబైల్ తయారీదారులు కార్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఇందులో టాటా మోటార్స్ ముందుంది, టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మినహా మిగతా అన్నీ కార్ల మోడల్స్ పై 65,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
ఈ పండుగ సీజన్ ఆఫర్ లో టాటా టియాగో, టైగర్, నెక్సాన్, హారియర్ కార్ల పై ఆఫర్లు ప్రవేశపెట్టారు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్ కూడా ఉన్నాయి, ఇవి అక్టోబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి.
also read మహీంద్రా థార్ కి పోటీగా ఇండియన్ రోడ్లపై మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ.. ...
టాటా ప్రధాన ఉత్పత్తి హారియర్‌తో ప్రారంభించి 5-సీట్ల ఎస్‌యూవీ వరకు 65,000 తగ్గింపు ఆఫర్ తీసుకొచ్చారు. ఇందులో వినియోగదారుల పథకం ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద 25,000 నుండి 40,000 తగ్గింపు ఉన్నాయి.
ముఖ్యంగా టాటా హారియర్‌లోని ఈ ఆఫర్‌లు డార్క్ ఎడిషన్, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ వేరియంట్‌లలో వర్తించవు. ఈ వేరియంట్ల కోసం కస్టమర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లతో పాటు, కార్‌మేకర్ టాటా ఎస్‌యూవీ కార్లపై కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.
నెక్సాన్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా టాటా పండుగ ఆఫర్లలో ఒక భాగం. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్‌పై రూ. 15,000 వరకు మాత్రమే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది. ఇది కాకుండా, కొనుగోలుదారులు ఎస్‌యూవీపై కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. పెట్రోల్ వేరియంట్లోలో ఆఫర్లు లేవు.