టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్...ధర ఎంతో తెలుసా...
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ తో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.15 లక్షలు (ఆన్-రోడ్, బెంగళూరు). ఇతర నగరాల్లో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడానికి ముందు దాని సొంత మార్కెట్ అయిన బెంగళూరులో మొదట విక్రయించనుంది.
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ఆరంగేట్రం చేసింది. టీవీఎస్ కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది.కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.15 లక్షలు (ఆన్-రోడ్, బెంగళూరు). ఇతర నగరాల్లో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడానికి ముందు దాని సొంత మార్కెట్ అయిన బెంగళూరులో మొదట విక్రయించనుంది.
కొత్త ఐక్యూబ్ కోసం టివిఎస్ కంపెనీ నెలకు 1,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది. మొదటి కొన్ని రోజుల్లో సుమారు 100 యూనిట్లను విక్రయించాలని చూపిస్తుంది.టివిఎస్ సంస్థ వెబ్‌సైట్‌లో లేదా ఎంచుకున్న డీలర్‌షిప్‌లలో 5వేల టోకెన్ గా కట్టి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్‌ను స్కూటర్ బుక్ చేసుకోవచ్చు.
also read మహీంద్రా నుండి కొత్త ఆఫ్-రోడ్ వాహనం....
టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ "టీవీఎస్ మోటారును కస్టమర్ సెంట్రిక్ ఇన్నోవేషన్ నడుపుతుంది. భారతదేశం ముందుకు వెళుతున్నప్పుడు, దాని చలనశీలత పరిష్కారాలు మొత్తం అనుభవ-నేతృత్వంలో ఉంటాయి, భారతదేశ యువతలో కంటే ఇది ఎక్కడా పదునుగా లేదు.
భారతదేశంలోని 'గ్రీన్ & కనెక్టెడ్' యువతపైనే మా దృష్టి, టీవీఎస్ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో టీవీఎస్ ఐక్యూబ్ మొదటిది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక అధునాతన ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్."ఈ-స్కూటర్‌ను 2012 ఆటో ఎక్స్‌పోలో మొదట కాన్సెప్ట్‌గా ప్రదర్శించారు. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్మార్ట్‌కనెక్ట్ కనెక్ట్ టెక్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టేయిల్ లైట్ తో వస్తుంది.
also read మెర్సిడెస్ బెంజ్ కొత్త సర్వీస్ ప్రోగ్రాం... కేవలం 3 గంటలో...
స్కూటర్ 6 bhp ఇంకా 140 Nm గరిష్ట టార్క్ అవుట్ పుట్ అభివృద్ధి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయానించగలదు.స్కూటర్ ఒక్కసారి ఛార్జీ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. 0-40 కిలోమీటర్ల స్పీడ్ ని 4.2 సెకన్లలో అందుకోలేదు. 4.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఇందులో అమర్చారు. ఇది 5 గంటల్లో పూర్తిగా ఫుల్ చార్జ్ చేస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ కోసం ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో లేదు. ఇది ట్రెడిషనల్ హబ్ మోటారును ఇందులో ఉపయోగించారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఓకినావా స్కూటర్ బజాజ్ చేతక్, అథర్ 450 లకు పోటీగా ఉంటుంది. బ్యాటరీ మానేజ్మెంట్ సిస్టం, సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, ఐక్యూబ్ ఎలక్ట్రిక్ మోటారు కూడా భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేశారని టివిఎస్ కంపెనీ తెలిపింది.