Asianet News TeluguAsianet News Telugu

అత్యధికంగా అమ్ముడైన టు -వీలర్‌ ఏదో తెలుసా...?

టీవీఎస్ మోటర్స్ 2019 నవంబర్‌లో మొత్తం 1,91,222 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగలిగింది. అయితే గత ఏడాది ఇదే నెలలో నమోదైన 2,60,253 యూనిట్లతో పోలిస్తే మొత్తం అమ్మకాలు 26.5% తగ్గాయి.
 

tvs best two wheeler sales in 2019
Author
Hyderabad, First Published Dec 30, 2019, 4:20 PM IST

నవంబర్ 2019 వరకు టీవీఎస్ మోటర్స్ వివిధ మోడల్స్ వారీగా అమ్మకాల నివేదిక విడుదల చేసింది. అయితే ఎక్స్ఎల్ 100 (మోపెడ్) బైక్ అమ్మకాలు టి‌వి‌ఎస్ బ్రాండ్ నుండి మిగతా అన్ని ద్విచక్ర వాహనాల మోడల్స్ సేల్స్ ని అధిగమించింది. టీవీఎస్ మోటర్స్ 2019 నవంబర్‌లో మొత్తం 1,91,222 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగలిగింది. అయితే గత ఏడాది ఇదే నెలలో నమోదైన 2,60,253 యూనిట్లతో పోలిస్తే మొత్తం అమ్మకాలు 26.5% తగ్గాయి.

also read ఈ దశాబ్దిలో బెస్ట్ బైక్స్.. స్కూటర్లు ఇవే..


గత కొన్ని నెలల నుండి బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనమైన టివిఎస్ జుపిటర్ స్కూటర్ ని అధిగమించిన ఎక్స్ఎల్ 100 (మోపెడ్) ఇప్పుడు అమ్మకాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది 2019 నవంబర్‌లో మొత్తం 57,550 యూనిట్ల అమ్మకాలను రిజిస్టర్ చేయగలిగింది. జుపిటర్ స్కూటర్‌ను దాదాపు 16,500 యూనిట్లు అమ్ముడుపోయాయి. టీవీఎస్ జుపిటర్ అమ్మకాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

అదే కాలంలో మొత్తం 41,007 యూనిట్ల అమ్మకాలను సాధించింది.ప్రతి యేడాది అమ్మకాలను పోల్చి చూస్తే, టి‌వి‌ఎస్ XL సూపర్ ఇంకా జుపిటర్ రెండూ మొత్తం అమ్మకాలు వరుసగా 23% , 41% తగ్గుముఖం పట్టాయి. టీవీఎస్ బ్రాండ్‌కు చెందిన ఎన్‌టోర్క్ ఏకైక ద్విచక్ర వాహనం ఈ సంవత్సరం అమ్మకాలలో మొత్తం 32% పెరిగింది.

tvs best two wheeler sales in 2019


టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, 180 ఇంకా 200లు కూడా నవంబర్ 29 లో మొత్తం 29,668 యూనిట్లతో మంచి అమ్మకాలను సాధించగలిగాయి. అపాచీ ఆర్ఆర్ 310 గత నెలలో మొత్తం 112 యూనిట్ల సేల్స్ చేయగలిగింది. అయితే ప్రతి ఏటా అమ్మకాలు 2020 జనవరిలో ప్రారంభించబోయే మోటారుసైకిల్  బిఎస్ 6-కంప్లైంట్ వేరియంట్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున మోటారుసైకిల్ కోసం 15% తగ్గాయి. నవంబర్ 2019లో టివిఎస్ మోటార్ బైకులు మరియు స్కూటర్ల కోసం పూర్తి మోడల్ వారీగా అమ్మకాల నివేదిక విడుదల చేసింది:

also read 2019 Round Up: మార్కెట్లోకి రిలీజైన నవ నవరత్నలాంటి ‘కార్లివే’!!


1. ఎక్స్‌ఎల్ 100 (మోపెడ్) - 57,550 యూనిట్లు
2. జుపిటర్ - 41,007
3. అపాచీ - 29,668 యూనిట్లు
4.  ఎన్‌టోర్క్ - 27,390 యూనిట్లు
5. రేడియన్ - 9,045 యూనిట్లు
6. పెప్ ప్లస్ - 8,439 యూనిట్లు
7. క్రీడ - 7,123 యూనిట్లు
8. స్టార్ సిటీ - 5,105 యూనిట్లు
9. జెస్ట్ - 4,111 యూనిట్లు
10. విక్టర్ - 1,370 యూనిట్లు
11. వీగో - 302 యూనిట్లు
12. ఆర్ఆర్ 310 - 112 యూనిట్లు

Follow Us:
Download App:
  • android
  • ios