ఇంటర్నెట్ షేకింగ్: మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ‘తామ్‌రాజ్’బైక్
మోటారు సైకిళ్లలో రాజసం ఒలికించే బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌దే. తాజాగా మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం డిజైన్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ బైక్‌ను మోడిఫికేషన్ చేసింది. అలాగే, కొత్తగా మోటారు సైకిల్ నడిపే వారి కోసం ’తామ్‌రాజ్’ అనే పేరుతో డిజైన్ చేసిన ఈ బైక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
న్యూఢిల్లీ: చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా బైక్ నడిపే ప్రతి ఒక్కరినీ రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా ఆకర్షిస్తుంది. సొగసైన స్టైల్, రివ్వున దూసుకెళ్లే సామర్థ్యం, స్పీడ్ కంట్రోల్, నడుపుతూ వస్తుంటే ఉట్టిపడే రాజసం ఎన్‌ఫీల్డ్ బైక్‌కే సొంతం.
అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్ ఎప్పుడు విపణిలోకి వచ్చినా కస్టమర్లు విరగబడి మరీ కొనుక్కుంటారు. దానికి తగ్గట్లే ఖరీదైన సెగ్మెంట్ నుంచి మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా 350 సీసీ ఇంజిన్ తో కూడా ఎన్ ఫీల్డ్ బైక్ లను డిజైన్ చేస్తోంది. మోడిఫికేషన్ చేసిన ఎన్ ఫీల్డ్ బైకులకు కూడా మార్కెట్ మంచి గిరాకీ ఉంటుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను చాలా మంది మోటార్ ప్రియులు తమకు నచ్చినట్టు మోడిఫికేషన్ చేయించుకుంటారు. దేశవ్యాప్తంగా చాలా స్టార్టప్ కంపెనీలు ఎన్‌ఫీల్డ్ బైకులను మోడిఫికేషన్ చేస్తాయి. అలాంటి వాటిలో ఢిల్లీకి చెందిన నీవ్ మోటార్ సైకిల్స్ ఒకటి.
ఇది రీసెంట్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650ని మోడిఫికేషన్ చేసింది. దానికి ఇంటర్ సెప్టర్ 650 తామ్‌రాజ్‌గా పేరు పెట్టింది. ఈ తామ్‌రాజ్ మోడల్‌కు కొత్తగా పెయింట్ వేసింది. చేతితో తయారు చేసిన విడిభాగాలను వాడింది.
also read అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇండియాలో లాంచ్
మంచి లుక్ కోసం వెహికిల్ కస్టమైజేషన్ ప్రొడక్ట్స్‌నూ వినియోగించింది. 5–ఇంచ్ (127ఎంఎం) ట్యూబ్ టైప్ టైర్లకు జతగా కస్టమ్ ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా బిగించింది. మెకానికల్‌గా 648 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌కు ఎలాంటి ఆల్ట్రేషన్ చేయలేదు.
ప్రస్తుతం ఈ బైక్ ఫొటోలు మోటార్ సైకిల్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇంటర్ సెప్టార్ 650ని తామ్ రాజ్ గా మార్చడానికి నీవ్ మోటార్ సైకిల్స్ రూ. 1.90 లక్షలు వసూలు చేస్తోంది. దీనికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది.
ట్యాంక్ టాప్ కవర్, షార్టర్ ఫెండర్స్, ఫ్రంట్ సస్పెన్షన్ కవర్స్, బెల్లీ పాన్, లెథర్ సీట్లు డిజైన్ చేశారు. ముందు ‘స్లిమ్మర్ సర్క్యులర్ ఎల్ఈడీ‘ హెడ్ లైట్ సెటప్, హ్యాండిల్ బార్, ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్స్, రేర్ ఫెండర్, ఎల్ఈడీ టెయిల్ లైట్ ఫీచర్లు చేర్చారు. 646 సీసీ పార్లలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 52 ఎన్ఎం వద్ద గరిష్టంగా 47 పీఎస్ పవర్ విడుదల చేస్తుంది. దీన్ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో రూపొందించారు.