అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇండియాలో లాంచ్
బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ లో భాగంగా రెండు వేరియంట్‌లను అందుబాటులో తీసుకొచ్చింది. 840 ఐ గ్రాన్ కూపే, 840 ఐ గ్రాన్ కూపే ఎమ్ స్పోర్ట్ ఎడిషన్ అనే రెండూ 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి.
లగ్జరీ కార్ల తయారీ బీఎండబ్ల్యూ ఇండియా ఇప్పుడు ఒక కొత్త ఖరీదైన లగ్జరీ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ లో భాగంగా రెండు వేరియంట్‌లను అందుబాటులో తీసుకొచ్చింది. 840 ఐ గ్రాన్ కూపే, 840 ఐ గ్రాన్ కూపే ఎమ్ స్పోర్ట్ ఎడిషన్ అనే రెండూ 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి.
2020 బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ వీటి ధరలు రూ. 1.29-1.55 కోట్లుగా నిర్ణయించింది. 'ఎం 8 కూపే' పేరుతో తీసుకొచ్చిన అతి ఖరీదైన అతి విలాసవంతమైన కారు ధర రూ.2.15 కోట్లుగా నిర్ణయించింది. బిఎమ్‌డబ్ల్యూ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ పియారా కెంప్ఫ్ 8 సిరీస్ గ్రాన్ కూపే గురించి ఆమె మాట్లాడుతూ, "8 సిరీస్ ఎల్లప్పుడూ బిఎమ్‌డబ్ల్యూకి చాలా ప్రత్యేకమైనది, ఇది డ్రీమ్ కార్లతో ముడిపడి ఉంటుంది.
ఈ డ్రీమ్ కార్లు మిమ్మల్ని మానసికంగా తాకుతాయి, ఇంకా మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఇది ఒక లగ్జరీ స్పోర్ట్స్ కారు. దీని డిజైన్ మాస్టర్ పీస్, ఇంజనీరింగ్ కూడా మరింత ఆకర్షిస్తుంది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే నాలుగు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వస్తుంది. 840 ఐ, 840 ఐ ఎక్స్‌డ్రైవ్, ఎం 850 ఐ ఎక్స్‌డ్రైవ్, 840 డి ఎక్స్‌డ్రైవ్. భారతదేశంలో ఎంట్రీ లెవల్ 840i వెర్షన్‌ను మాత్రమే అందుబాటులో ఉంది.
ఇది 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5,000-6,500 ఆర్‌పిఎమ్ వద్ద 333 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది, 1,600-4,500 ఆర్‌పిఎమ్ మధ్య 500 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. మోటారు 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేశారు. కారు టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలాదు. కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాని అందుకోగలదు.
also read కరోనా కష్టాలు : కస్టమర్లకు ఆటోమొబైల్ సంస్థల ఆఫర్లే ఆఫర్లు
కారు ముందు భాగంలో కొత్త ఆకారంలో ట్విన్ గ్రిల్ క్రోమ్ బోర్డర్స్ తో వస్తుంది. స్వీప్‌బ్యాక్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. బేస్ మోడల్‌కు అడాప్టివ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు వస్తాయి. ఎం స్పోర్ట్ వేరియంట్‌కు బిఎమ్‌డబ్ల్యూ లేజర్‌లైట్‌ను 3 లెవెల్ ఎల్‌ఇడి లైట్లతో లో-బీమ్, హై-బీమ్, లేజర్ మాడ్యూల్‌తో హై-బీమ్ హెడ్‌లైట్‌లు లభిస్తాయి.
కారు రెండు వేరియంట్లకు 18,19-అంగుళాల లైట్-అల్లాయ్ వీల్స్ పొందుతాయి. కారుకు ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కూడా లభిస్తుంది. ఇందులో వాతావరణ నియంత్రణ, 2 యుఎస్‌బి సి-ఛార్జ్ పాయింట్లు, వెనుక కూర్చున్నా ప్రయాణీకులకు ఎసి వెంట్లతో కూడిన చిన్న కన్సోల్‌ను అందిస్తుంది.
ఈ కారుకు 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10.25-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, 3డి మ్యాప్‌లతో కూడిన నావిగేషన్, డైరెక్ట్ యాక్సెస్ బటన్లతో ఐడ్రైవ్ టచ్, వాయిస్ కమాండ్, మ్యాప్స్, ఆడియో ఫైల్స్ కోసం ఇంటిగ్రేటెడ్ 32 జిబి హార్డ్ డ్రైవ్.
ఇతర ఫీచర్లు 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ అసిస్టెంట్, కెమెరా, అల్ట్రాసౌండ్-ఆధారిత పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ (పిడిసి) సిస్టం, ముందు ఇంకా వెనుక భాగంలో రివర్సింగ్ అసిస్టెంట్, రియర్‌వ్యూ కెమెరా ఉన్నాయి. భద్రత పరంగా, ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్, రన్-ఫ్లాట్ టైర్లు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి), డైనమిక్ ట్రాబిక్షన్ కంట్రోల్ (డిటిసి) తో సహా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్సి), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటు, టైర్ ప్రెజర్ ఇండీకేషన్ ఫీచర్ ఉన్నాయి.