ఇండియన్ రోడ్స్ కోసం పియాజియో కొత్త స్కూటర్..
ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాంచ్ ఆలస్యం అయింది. తాజా నివేదికల ప్రకారం 2020 నవంబర్‌లో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సీ స్కూటర్ దేశంలో అమ్మకాలు ప్రారంభించనుంది.
ఇటాలియన్ కంపెనీ పియాజియో గ్రూప్ 2020 ఢీల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ-స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాంచ్ ఆలస్యం అయింది. తాజా నివేదికల ప్రకారం 2020 నవంబర్‌లో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సీ స్కూటర్ దేశంలో అమ్మకాలు ప్రారంభించనుంది.
ఈ సమాచారాన్ని పియాజియో ఇండియా చైర్మన్, ఎండి డియెగో గ్రాఫి ధృవీకరించారు. ఈ బైక్ ఢీల్లీ ఆటో ఎక్స్‌పోలో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
also read కేజిఎఫ్ బైక్ స్టయిల్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100కి.మీ మైలేజ్.. ...
అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 అనేది మోటో స్కూటర్ రూపొందించిన మ్యాక్సీ స్కూటర్. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను ఇటలీలోని అప్రిలియా బృందం రెండేళ్లలో రూపొందించి, అభివృద్ధి చేసింది.
అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ లో అదే 160 సిసి, 3-వాల్వ్ ఇంజిన్ ఉపయోగించింది. ఈ బైక్ 10.8 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదనంగా సివిటి (నిరంతరం వేరియబుల్ ట్రాన్స్మిషన్) ఇంజిన్ జోడించచింది.
అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 5-స్పోక్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ లో వస్తుంది. మంచి రోడ్ గ్రిప్ విస్తృతమైన పెద్ద టైర్లను అందించారు. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), డిస్క్ బ్రేక్‌లు స్టాండర్డ్ గా అందిస్తున్నారు. దీనికి పూర్తిగా ఎల్‌ఈడి లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
రెడ్, బ్లూ, వైట్, బ్లాక్ అనే నాలుగు రంగులలో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 లభిస్తుంది. అప్రిలియా హెల్మెట్, దుస్తులు కూడా లభిస్తాయి.