న్యూ ఢీల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్, అటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ మంగళవారం రూ.50 వేల ధరతో కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్‌ ఆటమ్ 1.0 ను విడుదల చేసింది. అటుమొబైల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఖర్చుతో కూడుకున్న కేఫ్-రేసర్ డిజైన్ ఎలక్ట్రిక్ బైక్ భారతదేశం అంతటా అందుబాటులో ఉంది.

పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా ఆధారపడి ఉంటుంది, కేవలం 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది, అటమ్ 1.0 బైక్ విడుదల ప్రకారం ఒకే ఛార్జీతో 100 కిలోమీటర్ల వరకు ప్రయనించొచ్చు. ఎలక్ట్రిక్ బైక్ పై 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా అందిస్తుంది.

ఈ బైక్ కోసం దేశీయ భాగాలను ఉపయోగించి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే అటమ్ 1.0 బైకుకి రిజిస్ట్రేషన్ అవసరం లేదని, దానిని నడుపుతున్న వ్యక్తికి లైసెన్స్ కూడా అవసరం ఉండదు అని పేర్కొంది.

also read ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ ఎంతో తెలుసా.. ...

టీనేజర్లు ఈ బైకుని చట్టబద్ధంగా ఉపయోగించవచ్చు. అటూమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వంశీ గడ్డం మాట్లాడుతూ “3 సంవత్సరాల కృషి తరువాత అటం 1.0 బైకుని ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది.

భారతదేశాన్ని స్థిరమైన, పర్యావరణ బాధ్యత కలిగిన దేశంగా మార్చాలనే మా పెద్ద నిబద్ధతలో అటం 1.0 ఒక ముఖ్యమైన మైలురాయి అని మేము నమ్ముతున్నాము.పటాన్‌చెరులో తయారీ కేంద్రం ఉంది.

దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,500 బైక్స్‌. డిమాండ్‌ను బట్టి అదనంగా 1000 బైక్‌లను ఉత్పత్తి చేస్తం ” అని అన్నారు. అటమ్ 1.0 బైకు 6 కిలోల తేలికపాటి పోర్టబుల్ బ్యాటరీని అమర్చారు. ఈ బైక్ ఒక ఛార్జీ కోసం 1 యూనిట్ వినియోగిస్తుంది అంటే  రోజుకు రూ.7-10 (100 కిలోమీటర్లకు)ఖర్చవుతుంది, సాంప్రదాయ ఐ‌సి‌ఈ బైక్‌లకు రోజుకు రూ.80-100 (100 కిలోమీటర్లకు)ఖర్చు చేయాల్సి ఉంటుంది.