ఒకినావాతో ఓటిఓ క్యాపిటల్ భాగస్వామ్యం.. ఇక కస్టమర్లకు ఈజీ వెహికిల్ లీజింగ్ సదుపాయం..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సొంతం చేసుకోవడానికి కొనుగోలుదారులకు ఇప్పుడు అనువైన లీజింగ్ ఆప్షన్ కూడా అందిస్తుంది. లీజింగ్ వ్యవధి 12 నెలల నుండి 36 నెలల వరకు ఉంటుంది. ఈ సౌకర్యం బెంగళూరు, పూణేలోని ఒకినావా డీలర్‌షిప్‌లలో లభిస్తుంది.
గురుగ్రామ్, 22 సెప్టెంబర్ 2020: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఒకినావా- ఓటిఓ క్యాపిటల్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సొంతం చేసుకోవడానికి కొనుగోలుదారులకు ఇప్పుడు అనువైన లీజింగ్ ఆప్షన్ కూడా అందిస్తుంది.
లీజింగ్ వ్యవధి 12 నెలల నుండి 36 నెలల వరకు ఉంటుంది. ఈ సౌకర్యం బెంగళూరు, పూణేలోని ఒకినావా డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. రాబోయే నెలల్లో పాన్ ఇండియాను మరింత విస్తరించనుంది.
ఓకినావా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ వాహనాన్ని బుక్ చేసుకునే వినియోగదారులకు ఒక ప్రయోజనం కూడా ఉంటుంది, ఏంటంటే ఇప్పుడు సురక్షితంగా ఇంటి వద్దనే కూర్చొని సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఆప్షన్ సులభంగా పొందవచ్చు.
కొనుగోలుదారులు ఒకినావా వాహనాన్ని కనీసం 12 నెలల వరకు లీజుకు తీసుకోవచ్చు, ఆ తర్వాత వారు వేరే స్టైల్ లేదా ఇతర మోడల్‌కి అప్‌గ్రేడ్ కావాలనుకుంటే అదనపు ప్రయోజనం కూడా పొందుతారు.
ఇతర ఫైనాన్సింగ్ ఆప్షన్స్ తో పోల్చితే ఓటిఓ యాజమాన్యం ఈఎంఐ పేమెంట్ ద్వారా ప్రతి నెలా 30 శాతం వరకు ఆదా చేయడానికి వినియోగదారులను సహాయపడుతుంది.
ఉదాహరణకు ఒకినావా వాహనంపై బ్యాంకు రుణం ద్వారా 2 సంవత్సరాల వ్యవధిలో నెలకు రూ.3960 ఖర్చు అవుతుంది, కానీ ఓటిఓ ఫైనాన్సింగ్‌తో కొనుగోలుదారులు నెలకు 2950 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. లాక్ డౌన్ సడలింపు తరువాత ఒకినావా వాహనాల డిమాండ్ పెరుగుదలను చూసింది.
also read డూకాటి బైక్ రైడర్ల కోసం కొత్త మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన డూకాటి.. ...
కోవిడ్ 19 వ్యాప్తి కారణంగ ప్రజలు ప్రజా రవాణాకు బదులు వ్యక్తిగత వాహనాలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు సరసమైనదిగా మార్చడానికి ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టింది.
ఇ-మొబిలిటీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి పరిశ్రమల వర్గాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఆలోచనలో ఉంది, ”అని ఓకినావా ఎండి, వ్యవస్థాపకుడు జీతేందర్ శర్మ అన్నారు. ఈ భాగస్వామ్యం పై ఓటిఓ కాపిటల్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ చాజెడ్ మాట్లాడుతూ “ఒకినావాతో భాగస్వామ్యాం మాకు చాలాకు సంతోషంగా ఉంది.
మా ఫైనాన్సింగ్ తో ఎలక్ట్రిక్ వాహనాన్ని ని కొనుగోలు చేస్తే ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది, తద్వారా ప్రజలు ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు. నెలవారీ ఈఎంఐలపై కూడా తక్కువ ఖర్చు చేయవచ్చు.
ఆటో పరిశ్రమ తిరోగమనం నుండి బయటపడుతోంది. పండుగ ఆఫర్లు, ఆన్‌లైన్ కొనుగోలు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తుందని మేము ఆశిస్తున్నాము. ”లాక్ డౌన్ సడలింపు తరువాత ఒకినావా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
ఒక నెలలోనే 1000 యూనిట్లకు పైగా అమ్మకాలు చేసింది, ఈ ఆర్థిక సంవత్సరంలో 40వేల యూనిట్లకు పైగా విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 350కి పైగా డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్ తో పనిచేస్తుంది.
ఓటిఓ గురించి
ఆటోమోటివ్ కొనుగోళ్లకు (కార్లు, ద్విచక్ర వాహనాలు) ఓటిఓ కొత్త మోడ్ ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది. ఇది రిటైల్ వినియోగదారులను లక్ష్యంగా పనిచేస్తుంది. ఓటిఓ ఫైనాన్స్ ప్లాన్‌లో ఓఎంఐలు (యాజమాన్య మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్) ఉన్నాయి, ఇవి ఈఎంఐల కంటే 30% తక్కువ.
ఐఐటి-ముంబై పూర్వ విద్యార్థి సుమిత్ చాజెడ్, హర్ష్ సారుపారియా 2018లో దీనిని స్థాపించారు. మూలధనాన్ని అందించడానికి బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలతో వాహనాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రత్యామ్నాయ ఆప్షన్ వినియోగదారులకు అందిస్తుంది. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://otocapital.in/.