డూకాటి బైక్ రైడర్ల కోసం కొత్త మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన డూకాటి..
కొత్త అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూసర్లకు అందుబాటులో ఉంది. డుకాటీ యాప్ కోసం సంబంధిత యాప్ స్టోర్స్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైడూకాటి యాప్ వినియోగదారుల కొత్త అనుభవాలు, సమీప డీలర్‌షిప్‌లకు అక్సెస్, ప్రత్యేకమైన కంటెంట్, బ్రాండ్ నుండి రాబోయే కొత్త మోడల్ బైక్స్ ప్రివ్యూలు ఉన్నాయి.
ఇటాలియన్ బైక్ తయారీదారు సంస్థ డుకాటీ కస్టమర్లతో మరింతగా కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా మైడూకాటి మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. కొత్త అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూసర్లకు అందుబాటులో ఉంది.
డుకాటీ యాప్ కోసం సంబంధిత యాప్ స్టోర్స్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైడూకాటి యాప్ వినియోగదారుల కొత్త అనుభవాలు, సమీప డీలర్‌షిప్‌లకు అక్సెస్, ప్రత్యేకమైన కంటెంట్, బ్రాండ్ నుండి రాబోయే కొత్త మోడల్ బైక్స్ ప్రివ్యూలు ఉన్నాయి.
ప్రస్తుతం వినియోగదారులు డుకాటీ వెబ్‌సైట్ లాగే మైడూకాటి కొత్త యాప్ లోకి సైన్ అప్ చేయవచ్చు.
also read కొత్త కలర్ ఆప్షన్ లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200.. ...
మైడూకాటి యాప్ జియోగ్రాఫికల్ -లొకేషన్ ఆధారంగా మీకు దగ్గరిలో ఉండే డూకాటి డీలర్‌లను గుర్తించగలదు, ఇంకా అందుబాటులో ఉన్న సేవలపై సంప్రదించవచ్చు.
కొన్ని క్లిక్‌లతో టెస్ట్ రైడ్ కోసం అపాయింట్‌మెంట్ కూడా పొందవచ్చు. డుకాటీ బ్రాండ్ క్రింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాల గురించి వినియోగదారులు రియల్ టైమ్ లో తాజాగా సమాచారం పొందవచ్చు.
డెస్మో ఓనర్స్ క్లబ్ (డిఓసి) కమ్యూనిటీ కోసం రిజర్వు చేసిన విభాగం ఇందులో ఉంది, ఇక్కడ యూసర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు అలాగే వారి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు. మైడూకాటి యాప్ లో వినియోగదారుల ఇంట్రెస్ట్, ప్రాధాన్యతల ఆధారంగా ప్రమోషన్లు, పర్సనలైసేడ్ సేవలకు అక్సెస్ అందిస్తుంది.