Asianet News TeluguAsianet News Telugu

పర్సనల్ వాహనల్లో బైక్‌లదే జోరు! తేల్చేసిన ఫిచ్ రేటింగ్స్

కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ఇక్కట్ల పాలవుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రత కోసం వినియోగదారులు సొంత వాహనాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. ప్రత్యేకించి మోటారు సైకిళ్ల మార్కెట్ పుంజుకుంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. 
 

Motorcycle segment to perform better than other auto verticals amid pandemic: Fitch
Author
Hyderabad, First Published Jul 4, 2020, 11:22 AM IST

న్యూఢిల్లీ: కరోనా అనంతర పరిస్థితుల్లో భారత ఆటోమొబైల్ రంగ పరిశ్రమలో మోటార్‌ సైకిల్‌ విభాగం మిగతా అన్నింటిలోకెల్లా మెరుగైన పనితీరు కనబర్చనున్నదని ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ ‘ఫిచ్‌ సొల్యూషన్స్‌’ అంటోంది. కరోనా సంక్షోభం వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపడమే ఇందుకు కారణమంటోంది. 

కరోనా కష్టకాలంలో రాబడి తగ్గడంతో వ్యక్తిగత వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారిలో చాలామంది ద్విచక్ర వాహనంతో సరిపెట్టుకోవచ్చని అంటోంది. ఈ పరిణామం టూవీలర్‌ కంపెనీలకు కొంత కలిసి రానుందని ఫిచ్‌ రేటింగ్స్ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో ద్విచక్ర వాహనాలకు గిరాకీ సమృద్ధిగా ఉండటంతో ఎగుమతుల రూపంలోనే అధిక ప్రయోజనం కలుగనున్నదని ఫిచ్‌ నివేదిక వెల్లడించింది.

అయితే,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్‌లో మోటార్‌ సైకిళ్ల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 23.7 శాతం తగ్గవచ్చు. టూవీలర్‌ కంపెనీల ఉత్పత్తి సైతం 16 శాతం తగ్గనుందని ఫిచ్ అంచనా వేసింది. 

also read  ఇలా కూడా అమెరికా కలలు నెరవేర్చుకోవచ్చు.. ఈబీ5 వీసాలపై ఇండియన్ల మొగ్గు ...

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో వాహన తయారీ ప్లాంట్లు, షోరూమ్‌లు మూతపడటం ఈసారి వాహన కంపెనీల విక్రయాలు, ఉత్పత్తిపై ప్రభావం చూపనున్నదని ఫేచ్ వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితితో వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో క్రమంగా తగ్గనున్నది. దాంతో వచ్చేసారి మోటార్‌ సైకిల్‌ విక్రయాలు 28.1 శాతం, ఉత్పత్తి 14 శాతం మేర పెరగవచ్చు.

2019-20లో దేశీయంగా ఉత్పత్తి చేసిన మోటారు సైకిళ్లలో 16.7 శాతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. భారతదేశం నుంచి నైజీరియా, కొలంబియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, కెన్యా దేశాలకు ఎక్కువగా మోటారు సైకిళ్లు ఎగుమతి అయ్యాయి. గ్లోబల్ ఈ-కామర్స్ పరిశ్రమ గ్రోత్ వేగం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios