Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలోకి బీఎండబ్ల్యూ సరికొత్త బైక్.. ప్రీ బుకింగ్ ద్వారా ఆర్డర్స్..

క్రూజర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్‌ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

 

luxury bike maker bmw launches new model r18  bike in india with pre bookings
Author
Hyderabad, First Published Sep 21, 2020, 12:14 PM IST

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ  మోటోరాడ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘ఆర్‌18 మోడల్‌'ను ఆవిష్కరించింది. క్రూజర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది.

ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్‌ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 1,802 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైకుకి ఆరు గేర్లు ఉన్నాయి. 

also read  ఎస్‌యూవీ స్టైల్‌లో మారుతి ఆల్టో నెక్స్ట్ జనరేషన్ మోడల్ కారు.. ...

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 భారతదేశంలో 2 వేరియంట్లలో లభించే క్రూయిజర్ బైక్. దీని లో వెర్షన్ ధర  రూ.18,90,000 (ఎక్స్-షోరూమ్) ధర నుండి టాప్ వెర్షన్ రూ.21,90,000 (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఈ బిఎమ్‌డబ్ల్యూ బైకు 89.84 బిహెచ్‌పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 వెనుక, ముందు టైర్లకు డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఈ బిక్ 345 కిలోల బరువు ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios