దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన వాహన శ్రేణిని అప్‌డేట్ చేయడం ద్వారా కొత్త మారుతి ఆల్టో  నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

గత రెండు దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ, క్రాస్‌ఓవర్ స్టైల్‌లో అద్భుతంగా ప్రదర్శించిన ఈ చిన్న కారు కొత్త లుక్ తో కంపెనీ పరిచయం చేయనుంది. ఆల్టో కారు గత రెండు దశాబ్దాలుగా దేశీయ మార్కెట్లో మంచి సేల్స్, పనితీరు కనబరుస్తోంది.

అంతేకాదు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఆల్టో కారు ఒకటి. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ధర రూ .2.94 లక్షలు, ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సిఎన్‌జి కిట్‌లో కూడా లభిస్తుంది.

 ఒక నివేదిక ప్రకారం, కొత్త మారుతి ఆల్టో నెక్స్ట్ జనరేషన్ మోడల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో గుర్తించింది. కంపెనీ ఈ కారుకు క్రాస్ఓవర్ స్టైల్ అండ్ లుక్ ఇచ్చింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్‌యూవీ స్టైల్ కార్లకు భారీ డిమాండ్ ఉంది, రెనాల్ట్ క్విడ్, ఎస్-ప్రెస్సోలను కూడా ఈ స్టైల్‌లోనే ప్రవేశపెట్టారు, దీనికి వినియోగదారుల నుండి మంచి స్పందన కూడా వస్తోంది.

also read బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ...

మారుతి ఆల్టోను జపాన్ మార్కెట్లో ప్రారంభించిన ఆల్టో ఐదవ తరం మోడల్ ఆధారంగా మొదటి తరం మోడల్ 2000లో కంపెనీ మొదటిసారిగా లాంచ్ చేసింది. కానీ 2012 సంవత్సరంలో దాని రెండవ తరం మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు, ఇది పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేశారు.

ఇతరా సమాచారం ప్రకారం సంస్థ నుండి వచ్చే కొత్త ఆల్టో కారు సైజ్ పెద్దదిగా ఉంటుంది, దాని ఎత్తు కూడా ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది.

అయితే, ఈ కారు టెస్టింగ్ నమూనాను చూస్తే కొత్త లుక్, కారు కాస్త పెద్దదిగా కనిపిస్తున్నట్లు చెప్పవచ్చు. దాని ఇంజిన్ వివరాలు, ఇతర వాటి గురించి సమాచారం లేదు. ఈ కారు లోపలి భాగాన్ని మెరుగుపరచడానికి కంపెనీ ఆధునిక ఫీచర్లు, టెక్నాలజీని ఉపయోగిస్తుందని భావిస్తున్నారు.

ఇది కాకుండా, ఈ కారులో మారుతి వాగన్ఆర్, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లలో ఉన్న కొన్ని భాగాలను కూడా కంపెనీ ప్రవేశపెట్టవచ్చు.

ఇంజిన్‌కు సంబంధించినంతవరకు మారుతి కంపెనీ ప్రస్తుత 800 సిసి, 1.0-లీటర్ కెపాసిటీ ఇంజన్ ఉపయోగించవచ్చు. అయితే, ఈ కారు  పవర్ ఉత్పత్తి గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేము.

ఈ కారు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌లతో అందించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం చివరినాటికి కంపెనీ ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు.