Asianet News TeluguAsianet News Telugu

కవాసాకి కొత్త మోడల్ బైక్ లాంచ్...ధరలు ఎంతంటే...?

కవాసాకి జెడ్ 900 బిఎస్ 6 కంప్లైంట్ చేసిన మొదటి మోడల్ భారతదేశంలో లాంచ్ చేశారు. బైక్ ప్రస్తుత అమ్మకాలతో సమానంగా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఇది ఫోర్ రైడింగ్ మోడ్‌లు - స్పోర్ట్, రెయిన్, రోడ్ అండ్ మాన్యువల్, మూడు-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు రెండు పవర్ మోడ్‌లతో కూడి వస్తుంది.
 

kawasaki launches new bs 6 engine bike launched
Author
Hyderabad, First Published Dec 27, 2019, 4:32 PM IST

ఇండియా కవాసాకి మోటార్ 2020 కవాసాకి  జెడ్ 900 బైక్ లాంచ్‌తో తొలి బీఎస్ 6 కంప్లైంట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 2020 కవాసాకి జెడ్ 900 ధర ₹ 8.50 లక్షల నుండి 9 లక్షల మధ్య (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)ఉంటుంది.బిఎస్ 4 మోడల్‌తో పోలిస్తే దీని ప్రస్తుత ధర పెరిగి 7.69 లక్షలకు రిటైల్ లభ్యమవుతుంది .

also read కొత్త ఎలక్ట్రిక్ బైక్....అదిరిపోయే మైలేజ్....

అధిక ధర ట్యాగ్ ఉన్నప్పటికీ, 2020 కవాసాకి  జెడ్ 900 ఇప్పుడు నాకేడ్ ఇన్-ఫోర్ సిలిండర్ మోటార్‌సైకిల్‌పై అదే పవర్, అదే టార్క్ నిలుపుకుంటూ ఎలక్ట్రానిక్స్ హోస్ట్‌ను పొందుతుంది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్, సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 750, కెటిఎమ్ డ్యూక్‌790లకు పోటీగా ఈ బైక్  నిలుస్తుంది.

kawasaki launches new bs 6 engine bike launched

2020 కవాసాకి జెడ్ 900 బిఎస్ 6 లూకింగులో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు. బైక్ ప్రస్తుత అమ్మకాలతో సమానంగా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఇది ఫోర్ రైడింగ్ మోడ్‌లు - స్పోర్ట్, రెయిన్, రోడ్ అండ్ మాన్యువల్, మూడు-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు రెండు పవర్ మోడ్‌లతో కూడి వస్తుంది.

also read కొత్త సర్విస్...కేవలం మూడు గంటల్లో కార్ సర్వీసింగ్...

కవాసాకి రైడ్యాలజీ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో పాటు కొత్త ఫీచర్లను యాక్సెస్ చేయడానికి కొత్త 10.9 సెంటీమీటర్ల టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దీనికి ఉంది. Z900 కూడా బిఎస్ 4 వెర్షన్‌లో లభించే హాలోజన్ యూనిట్ స్థానంలో ఎల్‌ఇడి హెడ్‌ ల్యాంప్‌తో అప్‌గ్రేడ్ అవుతుంది.

మెకానికల్ గా, కొత్త కవాసాకి జెడ్ 900 భారతదేశంలో బిఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. 9500 ఆర్‌పిఎమ్ వద్ద 123 బిహెచ్‌పి,  948 సిసి ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ మోటారు నుండి 7700 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌తో జత చేశారు.


బైక్ అదే సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ టెక్నాలజి. డన్‌లాప్ స్పోర్ట్‌మాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లలో ఈ బైక్ వస్తుంది. కొత్త Z900 మెటాలిక్ గ్రాఫైట్ గ్రే / మెటాలిక్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ స్పార్క్ బ్లాక్ / మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios