న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తమ వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ‘ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్ సర్వీస్’ పేరిట సర్వీసింగ్ సేవలను అందిస్తామని ప్రకటించింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే వినియోగదారుల కార్లకు పూర్తిస్థాయి సర్వీసింగ్ చేస్తామని హామీ ఇస్తోంది.

aslo read దుమ్ము రేపుతున్న బీఎస్-6 కొత్త మోడల్: ఒక్క నెలలో 60 వేల సేల్స్

బెంగళూరు నగరానికి మాత్రమే ప్రస్తుతం ఈ సేవలు పరిమితం అయ్యాయి. తదుపరి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలకు ఈ సేవలను విస్తరింపజేస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఈ ప్రీమియర్ ప్రైమ్ సర్వీస్ నుంచి వారంటీ మరమ్మతులతోపాటు ప్రధాన సేవలను మినహాయించింది.

ఈ వినూత్న సర్వీసు వల్ల వినియోగ దారులకు టైం కలిసి వస్తుంది. కేవలం సర్వీస్ సమయంలో మాత్రమే సర్వీస్ సెంటర్ వద్దకు కారు ఓనర్  వస్తే సరిపోతుంది. ఈ సర్వీసింగ్ ద్వారా ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్ మెంట్, బ్రేక్ ఫ్లూయిడ్ రీ ప్లేస్‌మెంట్, డస్ట్ ఫిల్టర్ రీ ప్లేస్‪మెంట్, వీల్ రొటేషన్, వాషింగ్, ఇంటిరీయర్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ విడి భాగాల క్లీనింగ్, ఫ్యూయల్ ఫిల్టర్ చెక్, ఫిల్టర్ రీ ప్లేస్ మెంట్, ఎయిర్ ఫిల్టర్ రీ ప్లేస్ మెంట్, డీజిల్ ఫ్యూయల్ ఫిల్టర్, బ్రేక్ డిస్కులు, బ్రేక్ ప్యాడ్లు, వీల్స్ బ్యాలెన్సింగ్ తదితర సేవలను అందించనున్నది. 

also read మారుతి సుజుకి సరికొత్త మోడల్...ఎనిమిది నెలల్లో 1.2 లక్షల యూనిట్ల సేల్స్.

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ సర్వీసెస్ విభాగం ఉపాధ్యక్షుడు శేఖర్ బిడే మాట్లాడుతూ భారతదేశంలో అమ్మకాలు ప్రారంభమైన తర్వాత వినియోగదారులతో ఎలా వ్యవహరిస్తున్నామన్నదే ముఖ్యమైన వ్యాపార వ్యూహం అని చెప్పారు. కస్టమర్ల లాయల్టీని గెలుచుకోవడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించామన్నారు. బిజీ జీవితంలో వినియోగదారుల టైం చాలా విలువైందని శేఖర్ బిడే చెప్పారు. 

ఈ సర్వీసుల ప్రారంభంతో వినియోగదారుల్లో విశ్వాసం కలగడంతోపాటు తమకు బాగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నామని శేఖర్ బిడే తెలిపారు. 2020లో కస్టమర్ సేవలను అందించడంపైనే కీలకంగా కేంద్రీకరించామని అన్నారు.