న్యూ ఢీల్లీ: వతరణంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం పలు కంపెనీలు ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నట్లు వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ ప్రకటించింది.

కే‌ఆర్‌ఐ‌డి‌ఎన్ గా పిలువబడే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ సంస్థ నుండి ఈ ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ ఉత్పత్తి. రోడ్ ట్రయల్ తో పాటు బైక్ సంబంధిత అన్ని పరీక్షలను కంపెనీ పూర్తి చేసిందని అయితే డెలివరీ ఆపరేటర్లు, బైక్ టాక్సీల కోసం ప్రత్యేక బైకుల తయారీకి కూడా కంపెనీ కృషి చేస్తోందని తెలిపింది.

కంపెనీ ప్రకారం ఈ బైక్  టాప్ స్పీడ్ 95 కెఎంపిహెచ్. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేసిన తరువాత బైక్ ఎకో మోడ్‌లో 110 కిలోమీటర్లు, సాధారణ రేంజ్ లో 80 కిలోమీటర్లు వెళ్ళగలదు. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

also read వాహనదారులు జాగ్రత.. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే మీ జేబు ఖాళీ..

దీని టార్క్ 160ఎన్‌ఎం కంటే ఎక్కువ. ఈ బైక్ 5.5కేతో అత్యధిక శక్తి, ఇందులో 3 కిలోవాట్ల లిథియం బ్యాటరీ, ఇద్దరు వ్యక్తుల సీటింగ్ సామర్థ్యం, బైక్‌లో కాంబి బ్రేక్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్  డిస్క్ 240 ఎంఎం, బ్యాక్  డిస్క్ 220 ఎంఎం. కే‌ఆర్‌ఐ‌డి‌ఎన్ బైక్ ముందు హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉన్నాయి.

80/100 17 అంగుళాల ట్యూబ్ లెస్ ఫ్రంట్ వీల్, 120/80 16 అంగుళాల ట్యూబ్ లెస్ రియర్ వీల్, డిజిటల్ ఓడోమీటర్, జి‌పి‌ఎస్ / యాప్ కనెక్ట్ తో వస్తుంది. దీనిలో హాలోజన్ అండ్ బల్బ్ 12v-35W హెడ్‌లైట్, డి‌ఆర్‌ఎల్ తో 12v-5 / 21W మల్టీ రిఫ్లెక్టర్ బ్రేక్ / టెయిల్ లైట్స్ ఉన్నాయి

కే‌ఆర్‌ఐ‌డి‌ఎన్ బైక్ ధర, ప్రీ-బుకింగ్
మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం కే‌ఆర్‌ఐ‌డి‌ఎన్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1.29 లక్షలతో రావచ్చు, మొదటి దశ డెలివరీలను ఢిల్ల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలలో విడుదల చేసిన తర్వాత ఈ బైక్ అక్టోబర్ లో డెలివరీ కావచ్చు.

ఈ బైక్‌ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రీ-బుకింగ్ కోసం వినియోగదారులు ముందస్తుగా ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
 

https://www.youtube.com/watch?v=4jppyd_AWaQ