సాధారణంగా వాహనదారులు ఆఫీసుకు లేదా బయటికి వెళ్ళినపుడు ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్ళడం, షార్ట్ కట్స్ మార్గాలను ఎంచుకొని ట్రాఫిక్ నిబంధనాలను పట్టించుకోకుండా వెళుతుంటారు.

ఒకోసారి అలా చేయడం వలన ప్రమాదాల భారీన పడే అవకాశం కూడా ఉంది. వాహనదారులు ఇక పై ట్రాఫిక్ రూల్స్ లైట్ తీసుకుంటే  జరిమాలతో మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. మోటారు వాహన చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణల్లో పలు కీలక నిబంధనలున్నాయి.

అయితే వీటన్నింటినీ తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఎలాంటి మినహాయింపులు ఉండవని తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 177 నుంచి 199 వరకు కలిపి 31 సెక్షన్లలో సవరణలు తెచ్చింది.

ఈ సెక్షన్ల కింద ఉల్లంఘనలకు గతం కంటే జరిమానాలను భారీగా పెంచారు అలాగే కొన్నింటికి జరిమానాతో పాటూ శిక్షలు కూడా ఊన్నాయి. ఈ సవరణ చట్టాన్ని గతేడాది సెప్టెంబరు ఒకటి నుంచి కేంద్రం అమల్లోకి తెచ్చింది.

also read సన్నీ లియోన్ కొత్త కారు చూసారా.. దీనిని ఎంత ఖర్చు చేసి కొన్నాదో తెలుసా.. ...

కానీ 11 సెక్షన్లలోని జరిమానాలను కొంతవరకు తగ్గించుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. మిగిలిన 20 సెక్షన్లలో జరిమానాలు భారీగా ఉండటంతో వీటిలోనూ వెసులుబాటుపై పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి.

దీనిపై సుప్రీంకోర్టు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి కేంద్రం తెచ్చిన సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని దీన్ని భారంగా భావించకూడదని, ప్రమాదాల నివారణకు దోహదపడేదిగా చూడాలని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు.

కేంద్రం నుంచి క్లారిటీ రావడంతో ఈ దస్త్రాన్ని రవాణాశాఖ ప్రభుత్వానికి పంపింది. సీఎం ఆమోదిస్తే నోటిఫికేషన్‌ విడుదల చేసి సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఉదాహరణకు హెల్మెట్ లేకపోతే వెయ్యి జరిమానా కట్టాల్సిందే. అంతేగాకుండా 3 నెలలపాటు మీ డ్రైవింగ్‌ లైసెన్సుపై  అనర్హతలో వేటు వేస్తారు. కాబట్టి వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.