దుమ్ము రేపుతున్న బీఎస్-6 కొత్త మోడల్: ఒక్క నెలలో 60 వేల సేల్స్

విపణిలోకి విడుదల చేసిన రెండు నెలల్లోనే హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంచలన రికార్డులు నెలకొల్పింది. గత నెల 20 నుంచి ఇప్పటి వరకు 60 వేలకు పైగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన యాక్టీవా ఎస్పీ 125 మోడల్ స్కూటర్లను విక్రయించింది.

Honda sells over 60,000 units of BS-VI Activa

ముంబై: దేశంలోని రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్ నుంచి వచ్చిన యాక్టివా తాజా వెర్షన్ విక్రయాలు దుమ్ము రేపుతున్నాయి. బీఎస్-6 ప్రమాణాలతో వచ్చిన సరికొత్త యాక్టివా స్కూటర్ ‘ఎస్‌పీ 125’లను ఇప్పటి వరకు 60 వేల యూనిట్లు విక్రయించినట్టు హోండా మోటారు సైకిల్స్ తెలిపింది. 

also read మారుతి సుజుకి సరికొత్త మోడల్...ఎనిమిది నెలల్లో 1.2 లక్షల యూనిట్ల సేల్స్.

బీఎస్-6 మోడల్ యాక్టివాను కంపెనీ సెప్టెంబర్ నెలలో ఆవిష్కరించింది. గత నెల 20వ తేదీ నుంచి బీఎస్-6 మోడల్ యాక్టీవా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉండడంతో హోండా సంస్థ ముందే తేరుకుని వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.


దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కార్బన్, సల్ఫర్ తక్కువ కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం బీఎస్-- నుంచి నేరుగా బీఎస్-6 ప్రమాణాలకు వెళ్లిపోయింది. దీంతో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి సరికొత్త ప్రమాణాలతోనే కొత్త వాహనాలను విడుదల చేస్తామని దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు ప్రకటించాయి. కాగా, యాక్టివా కొత్త బైక్ ‘ఎస్‌పీ 125’ ధర రూ.72వేలు. గత మోడల్ ధరతో పోలిస్తే ఇది 10-13 శాతం అధికం.

also read  పెట్రోల్, ఛార్జింగ్ అవసరం లేకుండా నడిచే కొత్త కార్

న్యూ మోటార్ బైక్ ఎస్పీ 125లో 19 నూతన పేటెంట్లు, 16 శాతం అధిక మైలేజీతోపాటు ఆరేళ్ల వారంటీ అందిస్తోంది హోండా మోటారు సైకిల్స్. టెక్నాలజీలో మార్పుల వల్లే ధరలు పెరిగాయని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. 

బీఎస్-6 ప్రమాణాలతో కూడిన పరికరాల రూపకల్పనకు ‘ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ), ఏసీజీ స్టార్టర్ మోటార్ వంటి పేటెంట్ పొందింది. తమ యాక్టీవా విక్రయాలే తమ సంస్థ పట్ల వినియోగదారుల్లో గల విశ్వాసానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 26 నూతన పేటెంట్లతో 13 శాతం అదనపు మైలేజీతో ఐడిలింగ్ స్టాప్ సిస్టమ్, అదనపు స్టోరేజీ వ్యవస్థను కలిగి ఉందీ హోండా యాక్టీవా.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios