హోండా డియో బిఎస్ 6 స్కూటర్ లాంచ్....అప్ డేట్ ఫీచర్స్ కూడా...
హోండా కంపెనీ నుండి కొత్త డియో అప్ డేట్ 110 సిసి స్కూటి బిఎస్ 6 ఇంజన్‌తో వస్తుంది. ఇది కొత్త సైలెంట్-స్టార్ట్ ఎసిజి స్టార్టర్ తో వచ్చేసింది.కొత్త హోండా డియో మొత్తం ఏడు కొత్త కలర్లలో స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తున్నారు.
ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అప్‌డేట్ చేసిన హోండా డియోను విడుదల చేసింది. ఇది ఇప్పుడు భారత్ స్టేజ్ VI (బిఎస్ 6) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.
కొత్త హోండా డియో ధర 59,990. కొత్త డిజైన్, కొత్త ఫీచర్లతో ఇంకా కొంచెం పొడవైన వీల్‌బేస్ కూడా ఉంది. కొత్త హోండా డియోకు 6 సంవత్సరాల వారంటీ - 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ, 3 సంవత్సరాల అదనపు ఆప్షనల్ వారంటీ కూడా ఇస్తున్నారు.
కొత్త హోండా డియో మొత్తం ఏడు కొత్త కలర్లలో స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తున్నారు.కొత్త హోండా డియో ఇప్పుడు ప్రోగ్రామ్ చేసిన ఫ్యుయెల్ ఇంజెక్షన్‌తో మెరుగైన భారత్ స్టేజ్ VI కంప్లైంట్ 110 సిసి ఇంజన్, ఇంకా హోండా మెరుగైన స్మార్ట్ పవర్ (ఇఎస్‌పి) సిస్టంతో నడిచే హోండా ఎకో టెక్నాలజీ (హెచ్‌ఇటి) తో పాటు కొద్దిగా అప్ డేట్ డిజైన్, ఫీచర్లతో వస్తుంది.
also read ఆటో ఎక్స్ పోలో రెనాల్డ్ డస్టర్ సరికొత్త వెర్షన్
బిఎస్ 6 ఇంజన్ సున్నితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని హోండా కంపెనీ తెలిపింది. కొత్త ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హోండా ఈఎస్‌పి సిస్టం కొత్త సైలెంట్ స్టార్ట్ ఏసిజి స్టార్టర్ ఇందులో ఉంది. ఇది ఏసి జనరేటర్‌ను ఉపయోగిస్తుంది.
ఇంజన్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో పాటు, ఆఫ్‌సెట్ సిలిండర్, కాంపాక్ట్ వెయిట్ క్రాంక్ షాఫ్ట్, ఆప్టిమైజ్ పిస్టన్‌ను కూడా పొందుతుంది. పవర్ ని అందించడానికి ఫ్యుయెల్ ఇంజెక్షన్ సిస్టం ఆరు వేర్వేరు సెన్సార్లను ఉపయోగిస్తుంది.
కొత్త సిగ్నేచర్ ఎల్‌ఇడి పొజిషన్ లాంప్, మోడరన్ టెయిల్ లాంప్ డిజైన్, స్ప్లిట్ గ్రాబ్ రేల్స్, షార్ప్ లోగో, కొత్త బాడీ గ్రాఫిక్‌లతో కొత్త హోండా డియోకు కొత్త డిజైన్ లభిస్తుంది. పూర్తి-డిజిటల్ స్పీడోమీటర్ వంటి మూడు కొత్త రియల్ టైమ్ ఇన్ఫర్మేటిక్స్‌తో పొందుతుంది. ఇది రీడింగులు, ఫ్యుయెల్ టాంక్ కాపాసిటి, రియల్ టైమ్ ఫ్యుయెల్ టాంక్ లెవెల్ చూపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మొత్తం ట్రిప్, క్లాక్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ వంటి ఇతర వివరాలను కూడా చూపిస్తుంది.
కొత్త ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్ అలాగే ఒక ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్ కూడా దీనికి ఉంది. ఇది అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌కు సింగిల్ స్విచ్ యాక్సెస్‌ను, ఔటర్ ఫ్యుయెల్ క్యాప్ అందిస్తుంది. హై బీమ్ / లో బీమ్ కంట్రోలర్ స్విచ్, పాస్-లైట్ స్విచ్ కూడా అందిస్తుంది. సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు ఇంజిన్ కట్‌ఆఫ్‌తో సైడ్-స్టాండ్ ఇండికేషన్ ద్వారా ఇంజన్ స్టార్ట్ కాకుండా ఆపేస్తుంది.
also read వాహన అమ్మకాలు తగ్గిపోవడంతో... వచ్చే ఏడాదీ ప్యాసింజర్ వెహికల్స్ ఓకే...కానీ... ?
హోండా డియో 2020 ఇప్పుడు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను పొందుతుంది. అలాగే మెరుగైన వీల్‌బేస్, వెనుక భాగంలో అడ్జస్ట్ చేయగల బ్యాక్ సస్పెన్షన్, అలాగే ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ ఉంది.
హోండా డియో 2020 బిఎస్ 6 మోడల్ స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. హోండా డియో స్టాండర్డ్ వేరియంట్ ధర 59,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, కాండీ జాజీ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, వైబ్రాంట్ ఆరెంజ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా డియో డీలక్స్ వేరియంట్ ధర 63,340 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది కూడా మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్.