ఏది బెటర్?: హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్
ప్రపంచ స్కూటర్ మార్కెట్లో ఇప్పుడు హోండా యాక్టివాదే ఆధిపత్యం కొనసాగుతోంది. మనదేశంలో కూడా సగానికిపైగా మార్కెట్‌ను కలిగివుంది. అయితే, టీవీఎస్ జూపిటర్ కూడా ఈ స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుండటం గమనార్హం.
న్యూఢిల్లీ: ప్రపంచ స్కూటర్ మార్కెట్లో ఇప్పుడు హోండా యాక్టివాదే ఆధిపత్యం కొనసాగుతోంది. మనదేశంలో కూడా సగానికిపైగా మార్కెట్‌ను కలిగివుంది. అయితే, టీవీఎస్ జూపిటర్ కూడా ఈ స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుండటం గమనార్హం. ఇతర కంపెనీల స్కూటర్లు కూడా ఈ రెండింటికి పోటీ ఇస్తున్నప్పటికీ.. వేగంగా మార్కెట్‌ను పెంచుకోలేకపోతున్నాయి.
హోండా యాక్టివా 5జీ, టీవీఎస్ జూపిటర్ రెండు స్కూటర్లు కూడా దాదాపు ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. రెండు స్కూటర్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల వినియోగదారుడు ఏ స్కూటర్ కొనాలో తెలియక కొంత తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ రెండు స్కూటర్ల వివరాలు మీ ముందుంచుతాం. ఆ తర్వాత మీరే ఓ నిర్ణయం తీసుకోవచ్చు.
ఏగ్జెలరేషన్:
0-60కేఎంపీహెచ్:
టీవీఎస్ జూపిటర్ - 9.16 సెకన్లు
హోండా యాక్టివా 5జీ - 10.55 సెకన్లు
టాప్ స్పీడ్:
టీవీఎస్ జూపిటర్ - 85.93
హోండా యాక్టివా 5జీ - 90.77 కేఎంపీహెచ్
హోండా యాక్టివా 5జీ.. టీవీఎస్ జూపిటర్‌లాగే 7500ఆర్పీఎం వద్ద 8పీఎస్ ఉంది కానీ, 5500ఆర్పీఎం టర్క్ వద్ద 9ఎన్ఎం ఉన్న యాక్టివా.. జూపిటర్ కంటే 0.6ఎన్ఎం ఎక్కువగా ఉంది. 109కేజీ(కెర్బ్) వద్ద జూపిటర్ కంటే 1కేజీ యాక్టివా ఎక్కువ బరువు ఉంటుంది. వేగాన్ని అందుకోవడంలో మాత్రం జూపిటర్ ముందుంది.
బ్రేకింగ్:
60-0కేఎంపీహెచ్:
టీవీఎస్ జూపిటర్ - 20.20మీటర్లు
హోండా యాక్టివా 5జీ - 22.57 మీటర్లు
అంటే వేగాన్ని కంట్రోల్ చేయడంలో హోండా యాక్టివా కంటే టీవీఎస్ జూపిటర్ కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. జూపిటర్‌కు డిస్క్ బ్రేక్ ఉండగా, యాక్టివాకు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.
ఇంధన సామర్థ్యం:
సిటీలో అయితే:
టీవీఎస్ జూపిటర్ - 60.44కేఎంపీఎల్
హోండా యాక్టివా 5జీ - 58.1కేఎంపీఎల్
హైవే:
టీవీఎస్ జూపిటర్ - 66.7కేఎంపీఎల్
హోండా యాక్టివా 5జీ - 55కేఎంపీఎల్
ఇంధన సామర్థ్యం విషయంలో కూడా టీవీఎస్ జూపిటర్ కొత్త ఉతమంగా కనిపిస్తోంది. అటు సిటీలోనూ, ఇటు హైవేపైనా కూడా ఎక్కువ మైలేజీని ఇస్తోంది.
నమ్మకమైన మెకానికల్స్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా హోండా యాక్టివాకు పెద్ద మార్కెట్ ఏర్పడింది. టీవీఎస్ కూడా మంచి మైలేజీతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. అంతేగాక, వాహనదారుడి భద్రతకు దోహదపడే డిస్క్ బ్రేక్.. యాక్టివాకు లేకపోవడం గమనార్హం. ఇవన్నీ పరిశీలించిన తర్వాత యాక్టివా కంటే కొంత వరకు టీవీఎస్ జూపిటర్ స్కూటరే మేలని చెప్పవచ్చు.