న్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్.. ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ పెట్టుబడులు కలిగిన ఆటో స్టార్టప్‌ ఏథెర్‌.. ‘450 ఎక్స్‌’ పేరుతో మార్కెట్లోకి రెండో ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. నెలవారీ సబ్‌స్ర్కిప్షన్‌తో కూడిన ధరైతే రూ.99 వేలు పలుకుతుంది. రెండు సబ్‌స్ర్కిప్షన్‌ ప్యాక్‌లు అందుబాటులో ఉంటాయి.

also read మార్కెట్లోకి బజాజ్ కొత్త బీఎస్‌-6 బైక్స్...

ఏథర్ ప్లస్‌ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే నెలకు రూ.1,699, ప్రో వేరియంట్‌ కొనుగోలుపై నెలకు రూ.1,999 చెల్లించాలి. సబ్‌స్ర్కిప్షన్‌ ప్యాక్‌ను ఎంచుకోకుంటే ప్లస్‌ వేరియంట్‌ రూ.1.49 లక్షలు, ప్రో వేరియంట్‌ రూ.1.59 లక్షలకు లభించనుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బట్టిన ఈ విద్యుత్ స్కూటర్ల ధరలు ఖరారు కానున్నాయి.

2022 మార్చి చివరినాటికి తన వ్యాపార కార్యకలాపాలను 24 నగరాలకు విస్తరించాలని ఏథర్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా 1.3 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది ఎథేర్. కంపెనీ తన తొలి ఈ-స్కూటర్‌ ‘ఏథర్‌ 450’ని ప్రస్తుతం చెన్నై, బెంగళూరులో విక్రయిస్తోంది. త్వరలోనే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.

also read టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్...ధర ఎంతో తెలుసా...

ఎథేర్ 450ఎక్స్ తన ప్రత్యర్థి మోటారు సైకిళ్ల సంస్థలు బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఒకినావా ఐ ప్రెయిజ్ మోడల్ మోటారు సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. తమిళనాడులోని హోసూర్ నగరంలో నూతన ఉత్పాదక యూనిట్ ప్రారంభించడంతో తన విస్తరణ లక్ష్యంలో మరో అడుగు ముందుకేసింది. మరో ప్రొడక్షన్ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఈ బైక్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూసే సమయం తగ్గనున్నది. 

ఎథేర్ 450ఎక్స్ స్కూటర్ 8 బీహెచ్పీతో సమానమైన ఆరు కిలోవాట్ల విద్యుత్ శక్తి, 6 ఎన్ఎం నుంచి 26 ఎన్ఎం టార్చి సామర్థ్యం పెరిగింది. పాత మోడల్ స్కూటర్లతో పోలిస్తే 11 కిలోలు తక్కువగా ఉండటంతోపాటు గరిష్ఠంగా 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ స్కూటర్లలో బ్యాటరీ 2.9 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. రైడ్ మోడ్ స్కూటర్ల స్పీడ్ సామర్థ్యం 75 కిలోమీటర్లు.