వాషింగ్టన్: అమెరికాలోని మోటారు సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ఎలక్ట్రిక్ వాహనం ‘లైవ్ వైర్’ తయారీని పున: ప్రారంభించింది. లైవ్ వైర్ పేరిట ఉత్పత్తి చేస్తున్న బైకుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హార్లీ డేవిడ్సన్ తెలిపింది. 

also read టెక్నికల్ స్నాగ్స్: విద్యుత్ వెహికల్స్ నిలిపివేసిన హార్లీ

ఈ బైక్ ఓనర్లు సమస్య పరిష్కారం అయ్యే వరకు కేవలం డీలర్ల వద్ద మాత్రమే చార్జింగ్ చేసుకోవాలని పేర్కొంది. కానీ ఆ సమస్య ఏమిటన్న సంగతిని హార్లీ డేవిడ్సన్ బహర్గతం చేయలేదు. కాకపోతే అన్ని బైకుల్లో ఈ సమస్య తలెత్త లేదని, ఒక్క బైక్‌లో మాత్రమే ఈ సమస్య వచ్చిందని గుర్తించామని చెప్పింది. 

‘గతంలో నిలిపేసిన లైవ్ వైర్ బైక్‍ల ఉత్పత్తిని ప్రారంభించాం. ఒక్క బైక్ లో తలెత్తిన సమస్యను వారంలో పూర్తిగా విశ్లేషించాం. మేం లైవ్ వైర్ ప్రొడక్షన్, డెలివరీని పునరుద్ధరించాం’ అని తెలిపింది. 

also read ధోని కార్ల కలెక్షన్లలో మరో కొత్త కారు...

లైవ్ వైర్ బైక్‌లను ఉత్పత్తి చేస్తున్న హార్లీ డేవిడ్సన్.. ఈ నెల 15వ తేదీన సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు నిర్ధారణ కావడంతో దీంతో లైవ్ వైర్ మోటారు సైకిళ్ల ఉత్పత్తి, డెలివరీని నిలిపి వేశామని పేర్కొంది.

స్టాండర్డ్ కండీషన్ లేకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చినట్లు హార్లీ డేవిడ్సన్ తెలిపింది. 2014లో తొలిసారి లైవ్ వైర్ బైకును హార్లీ డేవిడ్సన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 29,799 (రూ.21.25 లక్షల) డాలర్ల వరకు ఉంది.