భారతదేశం అంతటా డుకాటీ డీలర్‌షిప్‌ వద్ద పెద్ద సంఖ్యలో భారత్ స్టేజ్ 4 మోడళ్లపై గణనీయమైన తగ్గింపును అందిస్తున్నాయి. అన్నీ డీలర్‌షిప్‌లలో  ఉన్న 10 మోడళ్లకు రూ. 1 లక్ష నుండి రూ. 3.5 లక్షల వరకు ఇస్తుంది. భరత్ స్టేజ్ 6 ఉద్గార నిబంధనలతో కొత్త వాహనాలు రానున్నాయి అయితే అన్నీ డీలర్‌షిప్‌లలో చాలా మొత్తంలో బిఎస్ 4 వాహనాలు మిగిలి ఉన్నాయి.

 ప్రీమియం మోటారుసైకిల్ డీలర్‌షిప్‌లు మిగిలిన పాత బిఎస్ 4 స్టాక్‌లను విక్రయించడానికి చాలా కష్టపడుతున్నాయి ఎందుకంటే 1 ఏప్రిల్ 2020వ తేదీన బిఎస్ 4 వాహన అమ్మకాలు  మిలిచిపోనున్నాయి. దీంతో అనేక బి‌ఎస్4 వాహనాలు స్క్రాప్ మెటల్‌గా మరకముందే వాటిపై తగ్గింపు ఆఫర్ అందిస్తూ సేల్స్ పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి.

also read ఆడీ, వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ నిలిపివేత....

మీరు అడ్వెంచర్ బైక్ లేదా స్పోర్ట్‌బైక్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, భారతదేశంలోని డుకాటీ డీలర్‌షిప్‌లు  స్పోర్ట్‌బైక్‌లు, స్ట్రీట్-ఫైటర్స్,  పవర్ క్రూయిజర్‌లతో సహా దాని 10 మోటార్‌సైకిళ్లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. బిఎస్ 4 డుకాటీ మల్టీస్ట్రాడా 1200 ఎండ్యూరోపై అతిపెద్ద డిస్కౌంట్ ప్రవేశపెట్టింది. ఈ మోడల్ 2017 లో ప్రారంభించారు.

మల్టీస్ట్రాడా 1200 ఎండ్యూరో బైక్ ఎక్స్-షోరూమ్ ధర ₹ 17.44 లక్షలు. ఆన్-రోడ్ ధర కంటే దీనిపై ₹ 3.5 లక్షల తగ్గింపు అందిస్తుంది.కొన్ని డుకాటీ డీలర్‌షిప్‌లు స్టాక్‌లో మాన్స్టర్ 821, స్క్రాంబ్లర్ 1100, మల్టీస్ట్రాడా 1260 వంటి డెమో బైక్‌లు కూడా ఉన్నాయి.

also read విపణిలోకి వోక్స్ వ్యాగన్ టీ-రాక్.. టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్స్

 డెమో బైక్‌లు ఢిల్లీ, ముంబైలలో మాత్రమే లభిస్తాయి. పానిగలే 959  కోర్సా వేరియంట్ వంటి స్పోర్ట్‌బైక్‌లపై కూడా 1 లక్షల వరకు మంచి తగ్గింపు లభిస్తుండగా, టాప్-ఆఫ్-ది-లైన్ పానిగలే వి4ఎస్ రూ .1.5 లక్షల తగ్గింపును ఇస్తుంది.ఈ డిస్కౌంట్‌లు డీలర్‌షిప్ నుండి డీలర్‌షిప్‌కు భిన్నంగా ఉంటాయి. ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్ ప్రాతిపదికన ఉంటాయి. డిస్కౌంట్లను బిఎస్ 4 మోడళ్లపై మాత్రమే అందిస్తున్నారు.