న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్‌ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ టీ-రాక్‌ కారును విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.19.99 లక్షలుగా నిర్ణయించారు.

1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారును ఏడు గేర్లు, స్పోర్ట్‌ డిజైన్‌, భద్రత ప్రమాణాలు, టెక్నాలజీ, నూతన డ్రైవింగ్‌ అనుభవం కల్పించడానికి పలు మార్పులు చేసినట్లు కంపెనీ ఇండియా డైరెక్టర్‌ స్టీఫెన్‌ క్నాప్‌ తెలిపారు. ఎస్‌యూవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కారును విడుదల చేసినట్లు వోక్స్ వ్యాగన్ తెలిపింది. 

దీంట్లో ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ స్టేబిలిటీ కంట్రోల్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, రివర్స్‌ కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. టూ హారిజోంటల్ స్లాట్స్, బంపర్ విత్ ఎయిర్ ఇన్ టేక్ విత్ టూ రెక్టాంగులర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అమర్చారు. 

వోక్స్ వ్యాగన్ టీ-రాక్ మోడల్ కారు 4 సిలిండర్ల ఇంజిన్‌తోపాటు 1500 ఆర్పీఎం వద్ద 250 ఎన్ఎం టార్చి, 5000 ఆర్పీఎం వద్ద 148 బీహెచ్పీ పవర్ కలిగి ఉన్నది. హిల్ స్టార్ట్ అసిస్ట్, స్టార్ట్ స్టాప్ సిస్టమ్ విత్ జనరేటివ్ బ్రేకింగ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ విత్ ప్యాడెల్ షిఫ్ట్, డిజిటల్ కాక్ పిట్ తదితర ఫీచర్లు జత కలిశాయి. 

వోక్స్ వ్యాగన్ టీ-రాక్ కారు లాకబుల్ వీల్ బోల్ట్స్, డ్రైవర్ ప్లస్ ఫ్రంట్ ప్యాసింజర్ లకు ఎయిర్ బ్యాగ్, హీటెడ్ ఎక్స్ టీరియర్ మిర్రర్స్, కన్ వెక్స్ డ్రైవర్ సైడ్ ఎక్స్ టీరియర్ మిర్రర, ఫ్రం్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్, డ్రైవర్ స్టీరింగ్ రికమండేషన్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 

యాంటీ స్కిడ్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఆటో డిమింగ్ ఐఆర్వీఎం, రేర్ వ్యూ కెమెరా, సేఫ్టీ ఆప్టిమైజ్డ్ ఫ్రంట్ హెడ్, డైనమిక్ హెడ్ ల్యాప్ రేంజ్ అడ్జస్ట్ మెంట్, రేర్ ఫాగ్ లాంప్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 

ఎస్ యూవీ టీ-రాక్ కారు బ్లాక్ కలర్డ్ ఎక్స్ టీరియర్ మిర్రర్స్, బాడీ కలర్డ్ డోర్, విత్ సిల్వర్ అనోడైస్డ్ రూఫ్ రెయిల్స్ తదితర ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు జీప్ కంపాస్, హ్యుండాయ్ టస్కన్ మోడల్ కార్లతో పోటీ పడనున్నది. వోక్స్ వ్యాగన్ టీ-రాక్ మోడల్ కారుతో పోలిస్తే జీప్ కంపాస్ కారు 11 డిఫరెంట్ ఇటరేషన్లతో నాలుగు వేరియంట్లలో ఆఫర్ చేస్తోంది. 

బీఎస్‌-6తో టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌.. గరిష్ఠంగా రూ.45 వేలు
మోపెడ్‌ మార్కెట్లో చరిత్ర సృష్టించిన టీవీఎస్‌ మోటర్స్‌.. తాజాగా తన ఎక్స్‌ఎల్‌ 100ని బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈటీఎఫ్‌ఐ టెక్నాలజీ కలిగిన ఈ వాహనం 15 శాతం అధిక మైలేజీ, మొబైల్‌ చార్జర్‌, ఫ్యూయల్‌ రిజర్వ్‌ ఇండికేటర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ వాహనం రూ. 43,500 నుంచి రూ.45 వేల లోపు లభించనున్నది.