ఇటాలియన్ బైక్స్ బెనెల్లి ప్రత్యేకమైన షోరూం ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో...

ఇటలీ కంపెనీ బెనెల్లి  ప్రత్యేకమైన బైక్ షోరూం మహాబుబ్‌నగర్‌లో ప్రారంభించింది. ఇందులో ఇటాలియన్ బ్రాండ్ సూపర్  బైక్‌లను  ప్రదర్శించనుంది.
 

Benelli's exclusive bike showroom started in mahabubnagar

ఇటలీకి చెందిన సూపర్‌ బైకుల సంస్థ బెనెల్లి,  ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా -మహావీర్ గ్రూప్ బెనెల్లి  27వ ప్రత్యేక షోరూమ్‌ను మహాబుబ్‌నగర్‌లో ప్రారంభించింది అత్యాధునిక బెనెల్లి షోరూం మహాబుబ్‌నగర్ లోని సర్వే నెం: 287, ప్లాట్ నెంబర్ 9, యెనుకొండ, మహాబుబ్‌నగర్, తెలంగాణ -509001 వద్ద  ఉంది. ఈ షోరూమ్‌లో ‘ప్రీమియం ఆటోమోటివ్స్’ డీలర్‌షిప్ కింద భారతదేశంలో లభించే అన్నీ బెనెల్లి సూపర్‌బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఈ షోరంలో అందుబాటులో ఉన్న సూపర్ బైక్స్ వివరాలు

సింగిల్-సిలిండర్, 400 సిసి రెట్రో క్లాసిక్: ఇంపీరియల్ 400 - రూ .1,79,500 / - నుండి ప్రారంభమవుతుంది

సింగిల్ సిలిండర్, 250 సిసి స్ట్రీట్ నేకెడ్: లియోన్సినో 250 - రూ .2.50 లక్షలు

ఇన్-లైన్ టూ సిలిండర్, 300 సిసి టూరర్ - టిఎన్టి 300 - రూ .2.99 లక్షలు

also read ట్రాఫిక్ నుండి ఆకాశంలోకి ఎగిరే కారు...వచ్చే ఏడాది అందుబాటులోకి...

ఇన్-లైన్ టూ సిలిండర్, 300 సిసి సూపర్‌స్పోర్ట్: 302 ఆర్ - రూ .3.10 లక్షలు

ఇన్-లైన్ టూ-సిలిండర్, 500 సిసి స్ట్రీట్ నేకెడ్ స్క్రాంబ్లర్: లియోన్సినో 500 - రూ. 4.79 లక్షలు

ఇన్-లైన్ టూ సిలిండర్, 500 సిసి అడ్వెంచర్ టూరర్: టిఆర్కె 502 - రూ .5.10 లక్షలు

ఇన్-లైన్ టూ-సిలిండర్, 500 సిసి ఆఫ్-రోడర్: టిఆర్కె 502 ఎక్స్ - రూ .5.50 లక్షలు

ఇన్-లైన్ ఫోర్-సిలిండర్, 600 సిసి స్ట్రీట్ నేకెడ్: టిఎన్టి 600 ఐ - రూ .6.20 లక్షలు
 

బెనెల్లి ఇండస్ట్రి- లీడింగ్ వారంటీతో స్టాండర్డ్ గా'అందిస్తున్నారు. ఇంపీరియల్ 400, లియోన్సినో 250, టిఎన్‌టి 300 మరియు 302 ఆర్‌ను 3 సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ స్టాండర్డ్ వారంటీతో  అందిస్తున్నారు. లియోన్సినో 500, టిఆర్‌కె శ్రేణి, టిఎన్‌టి 600 ఐలను 5 సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ స్టాండర్డ్    వారంటీతో  అందిస్తున్నారు.

also read టూ వీలర్ బైక్స్ పై భలే ఆఫర్లు : జస్ట్ మూడు వారాలు మాత్రమే

సర్విస్ అనుభవాన్ని మరింత ఒత్తిడి లేకుండా చేయడానికి బెనెల్లి ఇండియా తన వినియోగదారులకు పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ ఇంకా 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది. వినియోగదారులు కనీసం 4,000 రూపాయలతో ఇంపీరియల్ 400 బైకును బుక్ చేసుకోవచ్చు. - india.benelli.com లోకి లాగిన్ అవ్వడం ద్వారా దగ్గరలోని బెనెల్లి షోరూంలో లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయవచ్చు. ఇంపీరియల్ 400 రెడ్, బ్లాక్, సిల్వర్  మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

బెనెల్లి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబఖ్ మాట్లాడుతూ ప్రీమియం ఆటోమోటివ్స్‌తో మాకు చాలా ఆనందంగ  ఉంది అని అన్నారు మహాబుబ్‌నగర్‌లోని బెనెల్లి షోరూం ఉద్యోగులకు సేల్స్, సర్వీస్, కస్టమర్ ఎక్స్ పెరిఎన్స్ పరంగా ఉత్తమమైన వాటిని అందించడానికి శిక్షణ ఇస్తారు.

వినియోగదారులకు బెస్ట్ ఇన్  క్లాస్ ఇంకా  ఒత్తిడి లేని ఓనర్ షిప్ వీలు కల్పిస్తుంది "అని ఆయన అన్నారు. బైక్‌లతో పాటు, షోరూమ్‌లో అసెసోరీస్ కూడా ఉంటాయి. అలాగే కస్టమైజ్ ఆప్షన్ దశలవారీగా భారతదేశం అంతటా  ప్రవేశపెట్టరు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios