Asianet News TeluguAsianet News Telugu

బజాజ్ అవెంజర్స్ స్ట్రీట్ 160 ఏబీఎస్ విడుదల: ధరెంతో తెలుసా?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో శుక్రవారం తన వాహన శ్రేణిలో మరో సరికొత్త వాహనాన్ని అధికారికంగా ప్రవేశపెట్టింది. యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) కలిగిన అవెంజర్ స్ట్రీట్ 160 బైక్‌ను విడుదల చేసింది.

Bajaj Avenger Street 160 ABS Launched In India; Priced At Rs  82,253
Author
New Delhi, First Published May 10, 2019, 3:34 PM IST

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో శుక్రవారం తన వాహన శ్రేణిలో మరో సరికొత్త వాహనాన్ని అధికారికంగా ప్రవేశపెట్టింది. 
యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) కలిగిన అవెంజర్ స్ట్రీట్ 160 బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 82,253(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించారు.

సరికొత్త అవెంజర్ స్ట్రీట్ 160లో సింగిల్ ఛానల్ ఏబీఎస్‌తో పాటు రోడ్ స్టర్ డిజైన్‌లో ఎల్ఈడీ లైట్, సరికొత్త గ్రాఫిక్స్, బ్లాక్ అలాయ్ వీల్స్, వెనుకవైపు కూర్చున్న వాళ్లు పట్టుకునేందుకు సదుపాయం ఇతర ఫీచర్లు జత చేసినట్లు బజాజ్ వెల్లడించింది. 

ఈ సరికొత్త బైక్‌లు డీలర్ల వద్దకు చేరుకుంటున్నాయని, డెలివరీలు కూడా ఉంటాయని బజాజ్ తెలిపింది. ఈ బైక్ 14.7బీహెచ్‌పీతో 160.4సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 13.5ఎన్ఎం పీక్ టర్క్ కలిగివుంది. 

‘క్లాసికల్ రోడ్ స్టర్ డిజైన్‌తో వస్తున్న అవెంజర్ స్ట్రీట్ 160 ఏబీఎస్ నేటి యువత కోరుకునే బైక్‌ల జాబితాలో తప్పకుండా నిలిచి ఉంటుంది. వరల్డ్ క్లాస్ బైకింగ్ అనుభూతి కలిగిస్తుంది’ అని బజాజ్ ఆటో ఉపాధ్యక్షుడు(మార్కెటింగ్) నారాయణ్ సుందరరామన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios