డోమినార్ 400 బైక్ ధర తగ్గించిన బజాజ్: ఎందుకంటే?
బజాజ్ డోమినార్ 400 మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మంచి డిమాండ్‌ను కలిగివుంది. వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్‌గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఈ బైక్ అప్‌డేట్ చేయబడింది. ఈ అప్‌డేట్ చేయబడిన బైక్ ధరను రూ. 1,73,870గా నిర్ణయించింది.
బజాజ్ డోమినార్ 400 మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మంచి డిమాండ్‌ను కలిగివుంది. వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్‌గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఈ బైక్ అప్‌డేట్ చేయబడింది. ఈ అప్‌డేట్ చేయబడిన బైక్ ధరను రూ. 1,73,870గా నిర్ణయించింది.
అయితే, ఈ ధరపై బజాజ్ ఆటో రూ. 3,723 తగ్గింపును ప్రకటించింది. ఈ మొత్తం తగ్గింపు తర్వాత రూ. 1,70,138(ఎక్స్ షోరూం ధర)కే డోమినార్ 400 లభించనుంది. ఈ మేరకు బజాజ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అయితే, ఈ రకం బైక్‌ల ఉత్పత్తిని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ డిస్కౌంట్‌ను బజాజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అప్‌డేట్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన డోమినార్ 400 ఫీచర్లలో కొంత మార్పు చోటు చేసుకుంది. ముందు భాగంలో లప్‌సైడ్ డౌన్ సస్పెన్షన్ యూనిట్, స్లీకర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి. పాత మోడల్‌లో ఇవి లేవు.
కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో.. డ్యూయెల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్(డీఓహెచ్‌సీ) సెటప్ చేయబడి ఉంది. కంప్రెషర్ రేషియో 11.3 నుంచి 12.1కి పెంచడం జరిగింది. ఇది ఇంజిన్‌కు తగిన శక్తిని అందజేస్తుంది.
373.4సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8,650 ఆర్పీఎం వద్ద 39.4బీహెచ్ఎం విడుదల చేస్తుంది. 7,000 ఆర్పీఎం నుంచి 35ఎన్ఎం టర్క్ విడుదలవుతుంది. రీ-వర్క్‌డ్ ఎర్గోనామిక్స్‌తో ఈ బైక్ సుదూర సులభంగా ప్రాంతాలకు వెళ్లగలదు. రెండు స్క్రీన్‌లు కూడా ఉన్నాయి.
డోమినార్ 400 ఇప్పుడు నాలుగు రంగుల్లో వస్తోంది. మ్యాట్ బ్లాక్, సిల్వర్, గ్రాసీ రెడ్, ఆల్ న్యూ అరోరా గ్రీన్ రంగుల్లో ఉన్నాయి. బజాజ్ తాజాగా ధర తగ్గించడం పట్ల ద్విచక్ర వాహనాల ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.