న్యూఢిల్లీ: ఉద్గారాల నియంత్రణ కోసం సుప్రీంకోర్టు, కేంద్రం ఆదేశాల మేరకు ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటోమొబైల్స్ కూడా బీఎస్‌-6 మోడల్‌ బాట బట్టింది. అందులో భాగంగా విపణిలోకి సరికొత్త బైక్‌ను మార్కెట్‌లోకి బుధవారం తీసుకొచ్చింది. 

యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న బజాజ్‌ పల్సర్‌ 150 బైక్​ల్లో బీఎస్‌-6 మోడల్‌ను తాజాగా విడుదల చేసింది. బజాజ్ పల్సర్ ప్రారంభ ధరను రూ.94,956గా కంపెనీ నిర్ణయించింది. పల్సర్‌ 150, 150 ట్విన్‌ డిస్క్‌ వేరియంట్లలో ఈ బైక్ తీసుకొచ్చారు. మొదటి వేరియంట్ పల్సర్‌ 150 ధర రూ.94,956, ట్విన్‌ డిస్క్‌ ధర రూ.98,835గా ఉంటుందని సంస్థ పేర్కొంది. 

also read బీఎస్-6 సరే: మరి బీఎస్-4 వెహికల్స్ సంగతేంటి..?

బీఎస్‌-4 వాహనాలతో పోలిస్తే బీఎస్‌-6 ద్విచక్రవాహనాల ధర దాదాపు రూ.8,998 పెరిగినట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని బీఎస్‌-6 వాహనాలను తేనున్నట్లు కంపెనీ బజాజ్ ఆటోమొబైల్ బైక్‌ విభాగం ప్రెసిడెంట్‌ సరంగ్‌ కనడే తెలిపారు. పల్సర్‌ 150 బీఎస్‌-6 కూడా అద్భుత పనితీరు కనబరుస్తుందని చెప్పారు.

బజాజ్ పల్సర్ 150 మోడల్ మోటారు సైకిళ్లు 149.5 సీసీ సింగిల్-సిలిండర్ ట్విన్ స్పార్క్ డీటీఎస్-ఐ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్నాయి. 8500 ఆర్పీఎంతో 14 పీఎస్‌ శక్తినిస్తుంది. బ్లాక్ క్రోమ్, బ్లాక్ రెడ్ రంగుల్లో బజాజ్ పల్సర్ మోటారు సైకిళ్లు లభిస్తాయి. ఫోర్-స్ట్రోక్, ఎస్వోహెచ్సీ, టూ వాల్వ్, ఎయిర్ కూల్డ్, డీటీఎస్-ఐ, ఎఫ్ఐ ఇంజిన్ ఉంటుంది. 

also read బీఎస్-6 ధరలు పెరగడంతో... తగ్గిన వాహనాల అమ్మకాలు..

6500 ఆర్పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 31 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్సార్బర్, గ్యాస్ ఫిల్డ్ విత్ కానిస్టర్ కలిగి ఉన్నాయి. సింగిల్ చానెల్ ఏబీఎస్ సిస్టమ్, 130 ఎంఎం రేర్ డిస్క్ / డ్రమ్ ఫీచర్లు కూడా కలిగి ఉన్నాయి. 

2020లో విడుదలైన బజాజ్ పల్సర్ 150 బీఎస్-6 బైక్స్  80/100-ఆర్ 17 ట్యూబ్ లెస్ ఫ్రంట్ టైర్లు, 100/90-ఆర్ 17 ట్యూబ్ లెస్ రేర్ టైర్లు కలిగి ఉన్నాయి. వీటి ఇంధన సామర్థ్యం 15 లీటర్లు, ఎంట్రీ లెవెల్ స్పోర్టీ మోటారు సైకిళ్లు. 2055 ఎంఎం పొడవు, 765 ఎంఎం వైడ్ కలిగి ఉంటాయి ఈ మోటారు సైకిళ్లు.