కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

Also Read సచిన్, సెహ్వాగ్ లకు ఆల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో స్థానం కల్పించిన షేన్ వార్న

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు. తాజాగా.. మరో ఛాలెంజ్ ఇప్పుడు మొదలైంది.

 

కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన స్విస్‌ టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్‌ ఫెదరర్‌.. విరాట్‌ కోహ్లీ సహా అనేక మంది సెలెబ్రిటీలకు ఓ  సరదా చాలెంజ్‌ విసిరాడు. 

ఒక్కడే టెన్నిస్‌ రాకెట్‌తో బంతిని కొడుతూ సోలో డ్రిల్‌ చేస్తున్న వీడియోను ఫెడరర్‌ పోస్ట్‌ చేశాడు. ‘అందరికీ ఉపయోగకరమైన సోలో డ్రిల్‌. మీరెలా చేస్తారో వీడియోతో రిప్లై ఇవ్వండి’ అని ట్వీట్‌ చేశాడు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా కోహ్లీతో సహా అనేక మందిని ఫెదరర్‌ నామినేట్‌ చేశాడు.

దీనికి టెన్నిస్ ఎట్ హోమ్ హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశాడు. కాగా... ఈ ఛాలెంజ్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.