యమహా నుండి అతి చౌక ధర స్కూటీ విడుదల, ధర ఎంతో తెలుసా?

Yamaha Cygnus Ray ZR ‘Street Rally’ Edition Launched In India
Highlights

జపాన్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఓ స్కూటీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అత్యంత తక్కువ ధరతో సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ ను యమహా విడుదల చేసింది. ఈ మోడల్ డిల్లీ ఎక్స్ షోరూం ధరను రూ.57,898 గా నిర్ణయించింది. అయితే ఈ స్ట్రీట్ ర్యాలీ ఈ నెల చివరివారం వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యమహా షోరూంలలో అందుబాటులోకి రానుంది.

మంచి స్పోర్టివ్ లుక్ తో అందరినీ ఆకర్షించే విధంగా ఈ సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ ను రూపొందించారు. ముందుబాగంలో పక్షి రెక్కల ఆకారంలో ఫెయిరింగ్ దీనికి కొత్తదనాన్ని తీసుకువచ్చింది. కేవలం ఈ ఫెయిరింగ్ అలంకారంగానే కాకుండా ముందు వీల్స్ నుండి వచ్చే బురద,  మట్టి నుండి వాహనదారులను రక్షిస్తాయి. అడ్జస్టబుల్ సీటింగ్ కూడా ఈ మోడల్ లో మరో ప్రత్యేకతగా నిలిచింది. ఈ స్ట్రీట్ ర్యాలీ రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. ర్యాలీ రెడ్ మరియు రేసింగ్ బ్లూ రంగుల్లో ఆకర్షణీయంగా రూపొందించారు.

ఇక ఈ స్ట్రీట్ ర్యాలీ సాంకేతికత విషయంలోకి వెళితే... ఇందులో 113సీసీ కెపాసిటీ పెట్రోల్ ఇంజన్ ను వాడారు.  ఇందులో ముందు వైపున డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్ ని వాడారు. అల్లాయ్ వీల్స్, 21-లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్, ఫ్రంట్ పాకెట్, కీ సెక్యూర్ గ్రిప్ సిస్టమ్, ఎడ్జీ మరియు హై రైజింగ్ టెయిల్ లైట్ వంటి అధ్బుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

ఇన్ని అద్బుతమైన ఫీచర్లతో, అతి తక్కువ ధరకే లభిస్తున్న ఈ సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విసియోగదారులను ఆకట్టుకుంటుందని యమహా సంస్థ ప్రతినిధులు తెలిపారు. 
 
loader