Volkswagen Virtus Launch Date: భార‌త్‌లో వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారు లాంచ్.. ఎప్పుడంటే..?

వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారు భార‌త్‌లో త్వ‌ర‌లో లాంచ్ కానున్న‌ట్లు సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. జూన్ 9వ తేదీన ఈ కారును భార‌త్ మార్కెట్‌లో లాంచ్ చేయ‌నున్నుట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. అయితే ఈ కారు ప్ర‌త్యేక‌తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!
 

Volkswagen Virtus Launch Date

వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారును మనదేశంలో గత నెలలో ప్రదర్శించింది. ఈ కారు తయారీని కూడా మనదేశంలో ప్రారంభించింది. ఇప్పుడు ఈ కారు లాంచ్ తేదీని కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. జూన్ 9వ తేదీన ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. వెంటోకి రీప్లేస్‌మెంట్‌గా ఈ కారు లాంచ్ కానుంది. స్కోడా స్లేవియా, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగున్‌లను రూపొందించిన ప్లాట్‌ఫాంపైనే ఈ కారును కూడా రూపొందించారు. ఈ కారున భారతీయ మార్కెట్‌కు తగ్గట్లు 95 శాతం లోకలైజేషన్ చేశామని వోక్స్‌వ్యాగన్ అంటోంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లేవియాలతో వోక్స్‌వ్యాగన్ వర్టస్  పోటీ పడనుంది.

రెండు టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లతో ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. ఈ కారు ఎంట్రీ లెవల్ మోడల్లో 1.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 113 బీహెచ్‌పీ, 178 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. హైఎండ్ వేరియంట్లో 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 148 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్ స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లాంచ్ కానుంది. ఇందులో యాక్టివ్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ ఉండనుంది. లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేసేందుకు నాలుగు సిలిండర్లలో రెండు ఈ టెక్నాలజీ ద్వారా డీయాక్టివేట్ అవుతాయి.

స్లేవియా లాగానే వోక్స్‌వ్యాగన్ వర్టస్ లో కూడా బెస్ట్ వీల్ బేస్, బూట్ స్పేస్ ఉండనుంది. 10 అంగుళాల టచ్ స్క్రీన్, 8 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎయిట్ స్పీకర్ సౌండ్ సిస్టం, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, వెనకవైపు ఏసీ వెంట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఈ కారులో ఉన్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎనిమిది స్పీకర్ల సౌండ్ సిస్టంను కూడా వోక్స్‌వ్యాగన్ వర్టస్ లో అందించింది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ సేఫ్టీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు. అలానే ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ ఉన్న ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉండనున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios