Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ తర్వాత కార్ల జోరు.. ఈ నెలలో విపణిలోకి వచ్చే కార్లివే

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ఉత్పత్తికి, అమ్మకాలకూ దూరమైన దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ.. మే నెలాఖర్లో అంతంతమాత్రపు విక్రయాలతో సరిపెట్టుకున్నది.

Upcoming cars in July 2020: New Honda City, MG Hector Plus, and more
Author
New Delhi, First Published Jul 5, 2020, 11:05 AM IST

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ఉత్పత్తికి, అమ్మకాలకూ దూరమైన దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ.. మే నెలాఖర్లో అంతంతమాత్రపు విక్రయాలతో సరిపెట్టుకున్నది. గత నెలలో తిరిగి ఉత్పత్తిని ఆరంభించిన సంస్థలు.. ఈ నెలలో మార్కెట్‌లోకి కొత్త మోడల్స్‌ కార్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

మారుతీ, హ్యుండాయ్‌, హోండా, ఎంజీ మోటర్‌ సంస్థలు నూతన కార్లను తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కార్లను ఇప్పుడు తమ కస్టమర్ల ముందుకు తెస్తున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.. 

మారుతి ఎస్‌-క్రాస్‌ సరికొత్త పెట్రోల్‌ వర్షన్ 
మారుతి సుజుకీ తమ ఎస్‌-క్రాస్‌ కారును సరికొత్తగా పెట్రోల్‌ వెర్షన్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. బీఎస్-‌6 ప్రమాణాలతో 1.5 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది విపణిలోకి రాబోతున్నది. ఎస్‌-క్రాస్‌ కోసం మారుతి తొలిసారిగా ఏ 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, ఫోర్‌ స్పీడ్‌ టర్క్యూ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌లను వినియోగిస్తున్నది.

మిడ్‌-లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌తో హ్యుండాయ్ టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్‌
దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ గత ఫిబ్రవరిలో ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టక్సన్‌ అప్‌డేట్‌ మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. బయటికి చూడటానికి పెద్దగా మార్పులు కనిపించకపోయినా.. లోలోపల మాత్రం భారీ మార్పుచేర్పులతో వస్తున్నది. మిడ్‌-లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌తో దీన్ని తెస్తున్నారు. 2.0 లీటర్‌ టర్బో డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్ల సామర్థ్యంతో రానున్న ఈ కారులో సరికొత్త టచ్‌స్క్రీన్‌తో కొత్త డ్యాష్‌ బోర్డును పెట్టారు.

సరికొత్త హంగులతో న్యూ జనరేషన్ హోండా సిటీ
హోండా కార్స్ గత నెల కొత్త అవతారంలో తమ పాపులర్‌ మోడల్‌ ‘సిటీ’ని ఆవిష్కరించిన సంగతి విదితమే. అయితే దానికి అప్‌డేట్‌ మోడల్‌ను ఈ నెలలో తీసుకురానున్నది. ప్రస్తుత మోడల్‌తో పోల్చితే రాబోయే మోడల్‌ బహిర్గతంగా, అంతర్గతంగా మరిన్ని హంగులతో కనిపించనున్నది. 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌లు దీని సొంతం.

మార్పులూ చేర్పులతో ఎంజీ హెక్టార్‌ ప్లస్‌
ఎట్టకేలకు ఎంజీ మోటర్‌ ‘హెక్టార్‌ ప్లస్‌' కారును దేశీయ మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది. ఎప్పటి నుంచో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని చూస్తున్న సంస్థ.. ఈ నెలలో అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నది. ప్రస్తుత హెక్టార్‌తో పోలిస్తే కొన్ని మార్పులు కనిపిస్తాయి. బంపర్లు, హెడ్‌ల్యాంప్స్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, రేడియేటర్‌ గ్రిల్‌ ఆధునీకరించారు. 2.0 లీటర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్లతో లభిస్తుంది.

ఆడీ ఆర్ఎస్ 7 స్పోర్ట్స్ బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం
వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానున్న జర్మనీ ఆటోమేకర్ ఆడీ 2020 ఆర్ఎస్7 స్పోర్ట్ బ్యాక్ కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.10 లక్షల విలువ గల ఈ కారు 8స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో 4.0 లీటర్లు, టీఎఫ్ఎస్ఐ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుంది. 48వీ మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్, 592 బీహెచ్పీ, 800 ఎన్ఎం టార్చ్ ఈ కారు సొంతం.  

Follow Us:
Download App:
  • android
  • ios