Asianet News TeluguAsianet News Telugu

అప్ కమింగ్ కార్స్ ఇన్ ఇండియా 2023: ఈ 10 కార్లను కొత్త సంవత్సరంలో లాంచ్ చేయవచ్చు.. ఫుల్ లిస్ట్ చూడండి..

2022లో ఎన్నో కొత్త లాంచ్‌లు జరిగాయి.  ఇందులో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ కార్ల నుండి ఇంటర్నల్ కబషన్ ఇంజిన్‌లతో కూడిన కార్లు ఉన్నాయి. 2023 కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 

Upcoming Cars in India 2023: These 10 cars can be launched in the new year see full list
Author
First Published Dec 27, 2022, 8:15 PM IST

భారతీయ మార్కెట్లో వాహన తయారీదారులు పట్టును కొనసాగించడానికి కొత్త కొత్త ఉపాయాలను ఉపయోగించాలి. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కార్ల తయారీదారులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇప్పటికే ఉన్న కార్లను అప్‌డేట్ చేస్తూ ఉండాలి లేదా కొత్త మోడళ్లను విడుదల చేయాలి. 2022లో ఎన్నో కొత్త లాంచ్‌లు జరిగాయి.  

ఇందులో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ కార్ల నుండి ఇంటర్నల్ కబషన్ ఇంజిన్‌లతో కూడిన కార్లు ఉన్నాయి. 2023 కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 2023లో రానున్న 10 కొత్త కార్ల గురించి సమాచారం మీకోసం..

2023లో విడుదల కానున్న కొత్త కార్ల లిస్ట్:
మారుతి బాలెనో క్రాస్
మారుతి జిమ్నీ లైఫ్ స్టైల్
టయోటా ఎస్‌యూ‌వి కూపే
మహీంద్రా థార్ 5 డోర్
మహీంద్రా  ఎక్స్‌యూ‌వి 400
టాటా సఫారి/ టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ Ai3
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
హోండా కాంపాక్ట్ ఎస్‌యూ‌వి 

అంతేకాకుండా, ఇండియాలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2023లో రెండు కొత్త SUVలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వాటి లాంచ్ కి ముందు కంపెనీ జనవరిలో జరిగే 2023 ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త మోడళ్లను పరిచయం చేయవచ్చు. మారుతి సుజుకి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఆటో ఎక్స్‌పోలో 5 డోర్ జిమ్నీ అండ్ YTB పేరుతో బాలెనో హ్యాచ్‌బ్యాక్ కోడ్ పేరుతో కొత్త SUV కూపేని పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిమ్నీ 5-డోర్ ఆగస్ట్ 2023 నాటికి లాంచ్ కానుంది. మరోవైపు మాస్ మార్కెట్ మారుతి బాలెనో క్రాస్, YTB అనే కోడ్ నేమ్ ఏప్రిల్ 2023 నాటికి లాంచ్ కావొచ్చు. ఈ మోడల్ ఫిబ్రవరి 2023 నాటికి విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ఇది మారుతి ఫ్యూచురో ఇ కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ వెర్షన్. 

ఇది కాకుండా ఇండియాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్  2023లో హారియర్ అండ్ సఫారీ ఎస్‌యూవీ  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ రెండు మోడళ్లను జనవరిలో జరిగే 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది. కొత్త మోడల్ లో డిజైన్ మార్పులు ఇంకా అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లను చూడవచ్చు. కొత్త హారియర్ అండ్ సఫారి ఫేస్‌లిఫ్ట్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అడ్వాన్స్డ్ ఫీచర్‌లతో వస్తాయి. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ అసిస్ట్ ఇంకా ఎన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios