నార్టన్ మోటార్‌సైకిల్స్‌లో టీవీఎస్ మోటార్ వేల కోట్ల పెట్టుబడి.. సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని..

నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ  టి‌వి‌ఎస్ మోటార్ కంపెనీ 2020లో రూ. 153 కోట్లకు కొనుగోలు చేసింది. నార్టన్ మోటార్‌సైకిల్స్ ఇటీవల వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని సోలిహుల్‌లో  కొత్త తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది.

TVS Motor invests around Rs 1000 crore in Norton Motorcycles, British PM expressed happiness

టి‌వి‌ఎస్ మోటార్ కంపెనీ (TVS motor company) యూ‌కే  అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పోర్టింగ్ బైక్ బ్రాండ్‌లలో ఒకటైన నార్టన్ మోటార్‌సైకిల్స్ (norton motorcycles)లో £100 మిలియన్ల (సుమారు రూ. 995 కోట్లు) కొత్త పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రకటన  UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారతదేశ పర్యటన సందర్భంగా జరిగింది. కొత్త పెట్టుబడితో టి‌వి‌ఎస్ సాంకేతికత, తయారీ సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి అవకాశాలను అందిస్తూనే, ఎలక్ట్రిక్ వాహనాలపై నార్టన్ కి సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ  టి‌వి‌ఎస్ మోటార్ కంపెనీ 2020లో రూ. 153 కోట్లకు కొనుగోలు చేసింది. నార్టన్ మోటార్‌సైకిల్స్ ఇటీవల వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని సోలిహుల్‌లో  కొత్త తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. టూ వీలర్ తయారీ సంస్థ ఇంగ్లండ్‌లో బ్రిటీష్ బైక్‌లను సంప్రదాయ చేతితో రూపొందించిన సాంకేతికతలను ఉపయోగించి ఆధునిక మెషినరీతో తయారు చేస్తారు. 

"2020లో మేము కొనుగోలు చేసిన నార్టన్ మోటార్‌సైకిల్స్‌లో సుమారు £100 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించడానికి కంపెనీ ఉత్సాహంగా ఉంది" అని TVS మోటార్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలెక్ట్రిఫీకేషన్ , అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి వాహనాలు, తయారీ,  మొబిలిటీ కోసం పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన చెప్పారు. నార్టన్ ప్రస్తుతం రీ-ఇంజనీరింగ్ చేసిన V4 SV అండ్ 961 కమాండోను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 

మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, "రాబోయే మూడేళ్లలో 250-300 ప్రత్యక్ష ఉద్యోగాలను, సప్లయ్ చైన్ లో మరో 500-800 పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేసారు. ఈ పెట్టుబడి రాబోయే కొన్ని సంవత్సరాలలో  గ్లోబల్ మార్కెట్ కి అద్భుతమైన ఉత్పత్తుల శ్రేణికి దారి తీస్తుంది. నార్టన్‌ను తిరిగి సరైన స్థానానికి తీసుకురావడానికి రాబర్ట్ హెంత్‌చెల్ నేతృత్వంలోని ప్రపంచ స్థాయి బృందం పని చేస్తోంది." 

UK ప్రధాని 
బోరిస్ జాన్సన్ ఒక ప్రకటనలో, "UK అండ్ భారతదేశం మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మా రెండు దేశాలలో ఉద్యోగాలను ఇంకా జీవనోపాధిని సృష్టిస్తున్నాయి. TVS మోటార్ కంపెనీ UKలో పెట్టుబడులు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము భారతీయులతో వ్యాపారం  చేరాలని నిర్ణయించుకున్నాము.  తద్వారా మన ఫ్యూచర్ మొబిలిటీ రంగానికి ఆజ్యం పోస్తుంది ఇంకా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది." అని అన్నారు.

ప్రముఖ బ్రిటిష్ బ్రాండ్
నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను 1898లో బర్మింగ్‌హామ్‌లో జేమ్స్ లాన్స్‌డౌన్ నార్టన్ స్థాపించారు. నార్టన్ మోటార్‌సైకిల్స్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios