Asianet News TeluguAsianet News Telugu

టి‌వి‌ఎస్ అపాచీ కొత్త స్పెషల్ ఎడిషన్‌.. స్టయిల్, లుక్ అదిరిపోయిందిగా..

కొత్త 2023 టి‌వి‌ఎస్ అపాచీ ఆర్‌టి‌ఆర్ 160 4వి స్పెషల్ ఎడిషన్ అపాచీ ఆర్‌టి‌ఆర్ 4V  స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే కాస్మెటిక్స్ అండ్ మెకానికల్ అప్‌డేట్స్ పొందుతుంది. 

 TVS launches new special edition of Apache know price and features
Author
First Published Dec 1, 2022, 12:58 PM IST

టి‌వి‌ఎస్ మోటార్ కంపెనీ  అపాచీ ఆర్‌టి‌ఆర్ 160 4వి  న్యూ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,30,090. ఇప్పుడు అన్ని ఆథరైజేడ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. కొత్త 2023 టి‌వి‌ఎస్ అపాచీ ఆర్‌టి‌ఆర్ 160 4వి స్పెషల్ ఎడిషన్ అపాచీ ఆర్‌టి‌ఆర్ 4V  స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే కాస్మెటిక్స్ అండ్ మెకానికల్ అప్‌డేట్స్ పొందుతుంది. అలాగే కొన్ని కొత్త ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ బైక్ మ్యాట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ పెయింట్ స్కీమ్‌లో లభిస్తుంది ఇంకా కొత్త పర్ల్ వైట్ కలర్ లైనప్‌లో చేరింది. 

ఇంజన్ అండ్ పవర్
మెకానికల్ మార్పుల గురించి మాట్లాడితే అపాచీ ఆర్‌టి‌ఆర్ 160 4వి కొత్త ఎగ్జాస్ట్‌ను పొందింది. TVS దీనికి 'బుల్‌పప్ ఎగ్జాస్ట్' అని పేరు పెట్టింది అలాగే  మెరుగ్గా వినిపిస్తుందని తెలిపింది. ఈ బైక్‌ దీని కారణంగా  1 కిలో బరువు  తగ్గించడంలో సహాయపడింది. అయితే దీని ఇంజన్‌లో ఎలాంటి మార్పు లేదు.  అదే 159.7 cc, ఆయిల్-కూల్డ్, SOHC ఇంజన్‌తో ఫ్యూయల్ ఇంజెక్షన్ పొందుతుంది. ఈ ఇంజన్ 9,250 rpm వద్ద 17.30 bhp, 7,250 rpm వద్ద 14.73 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

3 రైడింగ్ మోడ్స్ 
ఈ బైక్ కి 3 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - అర్బన్, స్పోర్ట్ అండ్ రెయిన్. అర్బన్ ఇంకా రెయిన్ మోడ్‌లో, టాప్ స్పీడ్ గంటకు 103 కి.మీకి లిమిట్ చేయబడింది, అయితే స్పోర్ట్ మోడ్‌లో టాప్ స్పీడ్ గంటకు 114 కి.మీకి పెరుగుతుంది. 

లుక్ అండ్ డిజైన్
కాస్మెటిక్ మార్పుల గురించి మాట్లాడితే  రెడ్ అండ్ బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. సీటు బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో రూపొందించారు. అంతేకాకుండా కొత్త ప్యాటర్న్ పొందింది. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా  అడ్జస్ట్ చేయగల బ్రేక్ అండ్ క్లచ్ లివర్‌ పొందుతుంది. 

ఫీచర్లు
టి‌వి‌ఎస్ బ్లూటూత్ కనెక్టివిటీ SmartXonnectతో అపాచీ ఆర్‌టి‌ఆర్ 160 4వి స్పెషల్ ఎడిషన్‌ను  అందిస్తోంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర సాధారణ సమాచారం కాకుండా గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు కొత్త ఎల్‌ఈ‌డి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో అప్‌డేట్ చేసింది. 

సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్
బైక్ బ్రేకింగ్ కోసం ముందు వైపున 270ఎం‌ఎం పెటల్ డిస్క్, వెనుక 200ఎం‌ఎం పెటల్ డిస్క్‌ను పొందుతుంది. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌కు ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios