Toyota's cheapest car:కొత్త జనరేషన్ టయోటా గ్లాంజా.. బుకింగ్ ప్రారంభం, వచ్చే వారం లాంచ్..
కొత్త గ్లాంజా భారతదేశంలో టయోటా చౌకైన కారుగా రానుంది. అయితే ఈ కారు కొత్తగా విడుదల చేసిన మారుతి బాలెనో రీబ్రాండెడ్ వెర్షన్ మాత్రమే.
కొత్త జనరేషన్ గ్లాంజా కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రారంభించినట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) బుధవారం ప్రకటించింది. కొత్త జనరేషన్ టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు డెలివరీ మార్చి 15 నుంచి భారతదేశంలో ప్రారంభమవుతుంది. కంపెనీ రాబోయే హ్యాచ్‌బ్యాక్‌ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
చౌకైన టయోటా కార్
బుకింగ్ కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ఆథరైజేడ్ టయోటా డీలర్‌షిప్‌లలో చేసుకోవచ్చు. కొత్త గ్లాంజా భారతదేశంలో టయోటా చౌకైన కారుగా రానుంది. అయితే ఈ కారు కొత్తగా విడుదల చేసిన మారుతి బాలెనో రీబ్రాండెడ్ వెర్షన్ మాత్రమే.
లేటెస్ట్ అండ్ బడ్జెట్
బుకింగ్ ఆప్షన్ ప్రారంభంపై సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ “మేము కూల్ న్యూ గ్లాంజాను మీకు అందించడానికి సంతోషిస్తున్నాము. లుక్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అధునాతనమైన ఇంకా బడ్జెట్ ఆప్షన్ కోసం మా కస్టమర్‌లు కొన్ని సంవత్సరాలుగా టయోటా గ్లాంజాపై తమ విశ్వాసాన్ని ఉంచినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టయోటా గ్లాంజా లాంచ్ టొయోటా భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది, ఈ ఉత్పత్తి టయోటాకి మొట్టమొదటి సారిగా కస్టమర్‌లు, ఇప్పటికే ఉన్న టయోటా కొనుగోలుదారులు, ముఖ్యంగా టైర్ II మరియు III మార్కెట్‌ల నుండి కలిసి వచ్చింది.
ఇంజన్ వివరాలు
కొత్త గ్లాంజా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT యూనిట్‌తో జతచేసారు. మెరుగైన మైలేజీ కోసం కంపెనీ ఈ ఇంజిన్‌లో యాక్టివ్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను కూడా ఉండవచ్చు. ప్రస్తుత మోడల్ లాగానే కొత్త కారు అదే ట్రిమ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది - వీటిలో G అండ్ V ఉన్నాయి.
ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
కొత్త గ్లాంజా లాంచ్‌కు ఇంకా వారం రోజుల సమయం ఉన్నప్పటికీ, కంపెనీ కొత్త గ్లాంజాలోని కొన్ని కీలక ఫీచర్ల టీజర్‌ను విడుదల చేసింది. కొత్త ఎక్ట్సీరియర్స్‌తో పాటు, కొత్త గ్లాంజా కొత్త-జెన్ బాలెనో ఆధారంగా క్యాబిన్‌లో కూడా కొన్ని మార్పులను చూస్తుంది. కొత్త గ్లాంజా 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరాతో పాటు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో, హెడ్స్-అప్ డిస్‌ప్లే అండ్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, రియర్ ఎయిర్‌కాన్ వెంట్స్, కొత్త HVAC కంట్రోల్స్, ఆటో-డిమ్మింగ్ IRVM, స్లైడింగ్ డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా అప్‌డేట్ చేయబడిన గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో అందించారు. అప్ డెటెడ్ అప్హోల్స్టరీని ఉపయోగించడం ద్వారా కారుకు కొత్తదనాన్ని తీసుకురావడానికి టయోటా ప్రయత్నిస్తుంది.