Asianet News TeluguAsianet News Telugu

నో పార్కింగ్‌కు జరిమానాలు చెల్లించి విసిగిపోయి, ఏకంగా ఇంటి పైన కార్ యజమాని ఎం చేసాడో తెలుసా !

తన ఇంటి బయట వీధిలో కార్ పార్కింగ్ చేసినందుకు జరిమానా విధించిన తర్వాత అతను తన ఇంటి పై అంతస్తులో కార్లను పార్క్ చేసాడని ఒక న్యూస్ అలాగే  మరొక న్యూస్ ఏజెన్సీ వంటి అంతర్జాతీయ మీడియా నివేదించింది. 

Tired of paying fines for no parking, car  owner parks cars on top of house!-sak
Author
First Published Jun 16, 2023, 5:28 PM IST

రద్దీగా ఉండే నగరాల్లో కార్ పార్కింగ్ స్థలాన్ని కనుగొనడం చాలా మందికి పీడకలగా ఉంటుంది. ఒకోసారి వర్షం, ఎండ లేదా దుమ్ములో కారుని రోడ్డు పక్కనే పార్క్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు  రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే తరచూ జరిమానా చెల్లించాల్సి వస్తుంటుంది. తైవాన్‌లో ఓ వ్యక్తి ఇలా జరిమానా కట్టి కట్టి చివరికి  అతను చేసిన పని చాలా మంది వింతగా అనిపించింది. 


తన ఇంటి బయట వీధిలో కార్ పార్కింగ్ చేసినందుకు జరిమానా విధించిన తర్వాత అతను తన ఇంటి పై అంతస్తులో కార్లను పార్క్ చేసాడని ఒక న్యూస్ అలాగే  మరొక న్యూస్ ఏజెన్సీ వంటి అంతర్జాతీయ మీడియా నివేదించింది. తైవాన్‌లోని తైచుంగ్‌లో ఒక సివిల్ ఇంజనీర్ తన రెండు పాత వ్యాన్‌లను తన ఫ్లాట్ పైకప్పుపై పార్క్ చేసాడు. 

తైచుంగ్‌లోని నార్త్ డిస్ట్రిక్ట్‌లోని డోంగువాంగ్ 2వ వీధిలో ఈ ఘటన జరిగింది. నో పార్కింగ్‌కు సంబంధించి పలుమార్లు జరిమానా విధించడంతో తన కార్లను ఇంటిపైకి ఎక్కించేందుకు క్రేన్‌ను అద్దెకు తీసుకున్నట్లు యజమాని చెబుతున్నారు. ఇంటి పై కప్పుపై కార్లను  పార్క్ చేయడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఈ విచిత్రమైన ఘటన బయటి ప్రపంచానికి తెలిసింది. ఒక వ్యాన్ టెర్రస్  పైన  మరొక వ్యాన్ టెర్రస్ సగం గోడకు అనుకోని ఉంది. దింతో ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు. 

మున్సిపల్ అధికారులు వాహనాలను పైకప్పుపై నుంచి దించాలని అతనిని కోరారు. కానీ అతను ఎటువంటి చట్టాలను ఉల్లంఘించడం లేదని చెప్పాడు. నివేదికల ప్రకారం, ఇది భవనంపై ప్రభావం చూపదని ఇంకా గొడవ చేయవద్దని యజమాని చెప్పారు. భవనం ఉక్కు ఇంకా కాంక్రీటుతో నిర్మించబడింది కాబట్టి ఇది రెండు వాహనాల బరువుకు సపోర్ట్  చేస్తుంది అని యజమాని అన్నారు. యజమాని ఈ కార్లను సమన్లు నిల్వ చేయడానికి గోడౌన్‌గా కూడా ఉపయోగిస్తున్నాడు. ఈ వాహనాల్లో పైపులు, చెక్క పలకలు, పాత్రలు తదితర వాటిని  భద్రపరిచారు.

కార్ యజమాని చట్టాన్ని ఉల్లంఘించలేదని గుర్తించామని, అయితే ప్రజల భద్రత కోసం వాహనాలను ఇంటి నుండి తరలించాలని ఆదేశించామని అధికారులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios