ఈ కారు స్వయంగా ఛార్జ్ చేస్తుంది: లెక్సస్ ఎన్‌ఎక్స్ 350హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూ‌వి.. ఫీచర్లు అదుర్స్..

 కొత్త లుక్ లో లెక్సస్ ఎన్‌ఎక్స్ 350h ఎస్‌యూ‌వి వెలుపలి భాగంలో ఎన్నో డిజైన్ అప్‌డేట్‌లను పొందింది. దీనితో పాటు, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ప్రారంభించింది. 

This car will charge itself:2022 Lexus NX 350h Hybrid SUV Launched From Rs 64.90-71.60 Lakhs

లెక్సస్ ఇండియా (lexus india) భారతదేశంలో 2022 లెక్సస్ ఎన్‌ఎక్స్ 350హెచ్ (2022 Lexus NX 350h) హైబ్రిడ్ ఎస్‌యూ‌విని విడుదల చేసింది. కొత్త లుక్ లో లెక్సస్ ఎన్‌ఎక్స్ 350h ఎస్‌యూ‌వి వెలుపలి భాగంలో ఎన్నో డిజైన్ అప్‌డేట్‌లను పొందింది. దీనితో పాటు, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ప్రారంభించింది. అయితే హైబ్రిడ్ యూనిట్ సెల్ఫ్-ఛార్జింగ్‌తో వస్తుందని,  ఛార్జ్ చేయడానికి ప్రతిసారీ ప్లగ్ ఇన్ చేయాల్సిన అవసరం లేదని లెక్సస్ చెబుతోంది. 

హైబ్రిడ్ ఇంజిన్ అండ్ పవర్
2022 లెక్సస్ ఎన్‌ఎక్స్ 350h ఎస్‌యూ‌వి 2.5-లీటర్ 4-సిలిండర్  పెట్రోల్ ఇంజన్‌, ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ కారు దాదాపు 55 కి.మీల ఎలక్ట్రిక్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 192 hp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఆల్-వీల్-డ్రైవ్‌లో పెట్రోల్ అండ్ హైబ్రిడ్ యూనిట్  కలిపి అవుట్‌పుట్ 244 hp. ఈ ఇంజన్ 6-గేర్ e-CVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. లెక్సస్ గ్రీన్ ఫ్యూచర్ పట్ల నిబద్ధతను నొక్కి చెబుతుంది. 2050 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా ఉండాలనుకుంటున్నామని ఇంకా 2025 నాటికి  గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో కేవలం EVలు మాత్రమే ఉంటాయని కంపెనీ చెబుతోంది. 

లుక్ అండ్ డిజైన్
2022 లెక్సస్ NX 350h లుక్ ఎన్నో మార్పులతో అప్‌డేట్ చేయబడింది. వీటిలో సింగిల్-పీస్ LED హెడ్‌ల్యాంప్‌లకు అనుసంధానించిన కొత్త సెట్ DRLలు, లైట్ బార్‌కు జోడించిన కొత్త LED టైల్‌లైట్లు, పెద్ద స్పిండిల్ గ్రిల్ కోసం U-రకం ప్యాటర్న్ ఉన్నాయి. 

ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
2022 లెక్సస్ NX 350h SUV లోపలి భాగం కూడా అప్‌గ్రేడ్ చేయబడింది. అంటే ఇప్పుడు పెద్ద 14.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, కస్టమైజ్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్‌ను కూడా పొందుతుంది. SUV వెనుక సీట్లు ఎక్కువ స్థలాన్ని ఇవ్వడానికి మడత ఫీచర్‌తో వస్తాయి. 

ధర ఎంత అంటే
2022 Lexus NX 350h SUV రూ. 64.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. SUV టాప్-స్పెక్ F-Sport వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 71.60 లక్షల వరకు ఉంది. మిడ్-స్పెక్ ట్రిమ్ లగ్జరీ వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర 69.50 లక్షలుగా నిర్ణయించారు. 2022 Lexus NX 350h SUV బుకింగ్‌లు జనవరిలో ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కస్టమర్ల నుండి చాలా ప్రోత్సాహకరమైన స్పందన లభించిందని కంపెనీ పేర్కొంది. 

2022 లెక్సస్ NX 350h SUV ప్రీమియం SUV విభాగంలో మెర్సిడెస్ జి‌ఎల్‌సి(mercedes GLC), కొత్త ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ (Audi Q5 facelift), బి‌ఎం‌డబల్యూ ఎక్స్3 (BMW X3), వోల్వో ఎక్స్‌సి60 (Volvo XC60) వంటి కార్లతో పోటీపడుతుంది .
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios