Asianet News TeluguAsianet News Telugu

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లాంటి 5 బైక్‌లు ఇవే.. స్టయిలుకి స్టయిల్ ధర కూడా చాలా తక్కువ..

రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా నిలిచే టాప్ 5 బైక్‌ల గురించి తెలుసుకోండి. ఇవి స్టయిల్ కి స్టయిల్ లుకింగ్ లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లుక్ అందిస్తుంది. 
 

These are the 5 bikes that will challenge the Royal Enfield.. The price is also very affordable-sak
Author
First Published Jan 11, 2024, 7:35 PM IST

భారతదేశంతో సహా వివిధ దేశాల్లో క్లాసిక్ బైక్‌లు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ పొందాయి. ప్రస్తుతం, కొన్ని ఇతర బైక్స్  తయారీదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. మీరు ఈ బైక్‌లలో క్లాసిక్ అండ్ రెట్రో డిజైన్‌ను కూడా పొందుతారు. 

జావా, యేజ్డి, హోండా వంటి కంపెనీలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు పోటీగా ఎన్నో బైక్‌లను విడుదల చేశాయి. పవర్ ఫుల్  ఇంజన్లు, గొప్ప ఫీచర్లతో ఈ బైక్‌లు మీకు మంచి అప్షన్ గా ఉంటాయి. భారతీయుల కోసం బడ్జెట్ బైక్‌ను విడుదల చేసేందుకు హార్లే డేవిడ్‌సన్ ఈ ఏడాది హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

హోండా CB350 : హోండా రెట్రో క్లాసిక్ లుక్ CB350 రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ పోటీదారులలో ఒకటి. దీని డిజైన్ ఇంకా స్టయిల్ చాలా బాగుంటుంది. ఈ బైక్ 348.36సీసీ ఇంజన్‌తో వస్తుంది. భారతదేశంలో హోండా CB 350 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

హార్లే డేవిడ్‌సన్ X440 : హార్లే డేవిడ్‌సన్ X440 బైక్‌ను భారతీయ వినియోగదారుల కోసం చాలా బడ్జెట్ ధరలో విడుదల చేసింది. 440సీసీ ఇంజిన్‌తో ఈ లిస్టులో అత్యంత శక్తివంతమైన బైక్ ఇదే. స్టైలిష్ హార్లే బ్రాండ్ బైక్ ధర రూ.2.39 లక్షలు ఎక్స్-షోరూమ్.

జావా 42 : మహీంద్రా & మహీంద్రా ఆధ్వర్యంలోని జావా మోటార్‌సైకిల్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీదారి. మీరు జావా 42 కొనుగోలు కూడా చేయవచ్చు. ఈ ఏబైక్ 294.72సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

యెజ్డీ రోడ్‌స్టర్: మహీంద్రా  యెజ్డీ రోడ్‌స్టర్ ఈ విభాగంలో గొప్ప అప్షన్. Yezdi Roadster 334cc పవర్ ఇంజన్‌తో వస్తుంది. భారతీయ రోడ్లపై ప్రధానమైన యెజ్డీ  మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 2.08 లక్షలు.

బెనెల్లీ ఇంపీరియాలే 400 : బెనెల్లీ ఇంపీరియల్ 400 ఒక క్లాసిక్ మోటార్‌సైకిల్ శక్తివంతమైన బైక్. డిజైన్ అండ్ స్టయిల్ కి ఈ బైక్  మీకు మంచి అప్షన్. ఈ బైకులో  374 సీసీ ఇంజన్ ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు.

Follow Us:
Download App:
  • android
  • ios