నోయిడాకు చెందిన @cheekuthenoidakid అనే బాలుడు ఓ వీడియో ద్వారా ఆనంద్ మహీంద్రాను రూ.700లకు మహీంద్రా థార్ అడిగాడు. మహీంద్రా  థార్ అండ్  XUV700 ఒకటే అని   అనుకున్నాడు ఈ బాలుడు. 

దింతో రూ.700కి కారు ఆర్డర్ చేసిన చిన్నారికి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో బాలుడి ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచింది.

నోయిడాకు చెందిన @cheekuthenoidakid అనే బాలుడు ఓ వీడియో ద్వారా ఆనంద్ మహీంద్రాను రూ.700లకు మహీంద్రా థార్ అడిగాడు. మహీంద్రా థార్ అండ్ XUV700 ఒకటే అని అనుకున్నాడు ఈ బాలుడు.

అయితే ఈ బాలుడు వీడియోలో మహీంద్రా కారు అడగడం అందరినీ ఆకట్టుకుంది. బాలుడి మాటలకూ షాక్ అయిన ఆనంద్ మహీంద్రా కూడా ట్విట్టర్‌లో స్పందించారు.

మహీంద్రా థార్ వాహనాన్ని రూ.700కి అమ్మితే నా కంపెనీ దివాళా తీస్తుంది’ అని చమత్కరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్నేహితుడు సునీ తారాపొరేవాలా @soonitara షేర్ చేసిన వీడియోపై ఆనంద్ మహీంద్రా ఇలా స్పందించారు.

మహీంద్రా కారు కొనాలనుకున్న ఓ బాలుడు.. ఇలాంటి వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.

బాలుడు కొనుగోలు చేయాలనుకున్న మహీంద్రా థార్ 2020లో విడుదలైంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.10.98 లక్షల నుంచి రూ.16.94 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు మారుతి సుజుకి జిమ్నీకి పోటీగా వస్తుంది.

Scroll to load tweet…