Asianet News TeluguAsianet News Telugu

7 సంవత్సరాల తర్వాత ఆనంద్ మహీంద్రాకు మళ్ళి పరిచయమైన అమ్మాయి: స్టోరీ ఏంటంటే..?

7 సంవత్సరాల క్రితం, ఆనంద్ మహీంద్రా మహీంద్రా కారు  స్టీరింగ్ వీల్‌ను పట్టుకుని ఉన్న ఏడాదిన్నర చిన్నారి ఫోటోను షేర్ చేసారు. ఇప్పుడు అదే అమ్మాయి 7 సంవత్సరాల తర్వాత వచ్చి ఆనంద్ మహీంద్రాకు తనను తాను పరిచయం చేసుకోవడం ఆనందంగా మారింది.
 

The girl who introduced herself to Anand Mahindra after 7 years: What is the story-sak
Author
First Published Jun 20, 2023, 3:20 PM IST

ముంబై: మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికరమైన వీడియోలు లేదా పోస్ట్‌లు చేస్తూ తన 10 మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లను ఆశ్చర్యపరుస్తుంటాడు. అలాగే ఒక్కోసారి తాను పెట్టిన పోస్టుల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు కూడా ముందుకొచ్చారు. కొందరు ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. అదేవిధంగా 7 సంవత్సరాల క్రితం అతను ఒక చిన్న పాప మహీంద్రా కారు స్టీరింగ్  పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఇప్పుడు అదే చిన్నారి కాస్త పెద్దదై ఆనంద్ మహీంద్రను కలవడమే కాకుండా తన తండ్రితో పరిచయం చేసుకొని మీరు షేర్ చేసిన ఫోటోలోని అమ్మాయిని నేనే అని చెప్పింది. ఆనంద్ మహీంద్రా ఈ అందమైన క్షణం  ఫోటోను ట్విట్టర్‌లో మళ్లీ పంచుకున్నారు. 

నిన్న సాయంత్రం ఈ  అమ్మాయి రియా నా దగ్గరకు వచ్చి ఏడేళ్ల క్రితం ఆమె ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు నేను ఆమె ఫోటోని ట్వీట్ చేశానని నాకు గుర్తు చేసింది! ఆ ట్వీట్‌ని షేర్ చేసినందుకు @Gaurishrulzకి ధన్యవాదాలు. కౌంట్ డౌన్ కొనసాగుతోంది. నేనూ ఆమె మా కారును నడపడం కోసం వేచి ఉండలేను (అలా నడపడానికి  లైసెన్స్ అవసరం!) బహుశా ఆమె ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపవచ్చు, ”అంటూ  ఆనంద్ మహీంద్రా 8 సంవత్సరాల వయస్సుతో నిలబడి ఉన్న అమ్మాయి ఫోటోతో పాటు పోస్ట్ చేసారు.  

ఏడేళ్ల క్రితం, Gaurish Rules (@Gaurishrulz) 2016లో మహీంద్రా కారు స్టీరింగ్ వీల్ ముందు తన కుమార్తె ఫోటోను 'నాకు 18 ఏళ్లు ఎప్పుడు?   మరో 16.5 సంవత్సరాలు వేచి ఉండాల' అనే క్యాప్షన్ తో ఆనంద్  మహీంద్రాని, మహీంద్రాని ట్యాగ్ చేస్తూ పోస్ట్‌ చేశారు. 

దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ హాహా... ఈ ఫోటో మా ఆటో ఆర్కైవ్‌లో చేరుతుంది. అదే అమ్మాయి దేశీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను 7 సంవత్సరాల తర్వాత కలుసుకుంది అలాగే ఆమెతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి నిలబడి ఫోటో దిగారు, ఆనంద్ మహీంద్రా ఈ ఫోటోను ట్విట్టర్‌లో మళ్లీ షేర్ చేశారు. 

ఈ పోస్ట్‌ను 3 లక్షల మందికి పైగా వీక్షించగా, పలువురు కామెంట్ చేశారు. తరువాత ఆమె ఖచ్చితంగా మహీంద్రా కారును కొనుగోలు చేస్తుందని ఒక యూజర్ అన్నారు. మీ దయ, కరుణకు పెద్ద వందనం’’ అని మరొకరు,  మీ కస్టమర్లు మీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఫోటోలో ఉన్న ఒకటిన్నర సంవత్సరాల పాప 7 సంవత్సరాల తర్వాత వచ్చి ఆనంద్ మహీంద్రాను పరిచయం చేసుకుంది. ఇది ఆనంద్ మహీంద్రాను కూడా ఎంతో ఆశ్చర్యపరిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios