కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టెస్ల తన మొదటి ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును  ఆవిష్కరించింది. టెస్ల సైబర్ ట్రక్ ధర $ 39,900 (సుమారు రూ. 28,63,000) వద్ద ప్రారంభమవుతుంది. దీనిని  మూడు  వెర్షన్లలో అందుబాటులోకి  తేనుంది. 250 మైళ్ళు, 300 మైళ్ళు మరియు 500 మైళ్ళు. సంస్థ ఇప్పటికే సైబర్‌ ట్రక్ కోసం ముందస్తు ఆర్డర్‌లను  ప్రారంభించింది. టెస్ల ట్రక్ 2021 చివరి వరకు తయారిని ప్రారంభించదు.


మొదటి వేరియంట్‌లో సింగిల్-రియర్ వీల్-డ్రైవ్ మోటారు ఉంటుంది. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 250 మైళ్ళు నడుస్తుంది. దీనికి 7,500 పౌండ్ల ట్రక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది కేవలం  6.5 సెకన్లలో 0 నుండి 60 mph వేగాన్ని  అందుకోగలదు. దీని ధర $39,000  (సుమారు రూ. 28,63,000)గా నిర్ణయించారు.

also read  బీఎస్-6 పెట్రోల్ వెర్షన్‌లో బ్రెజ్జా, ఎస్-క్రాస్ కొత్త మోడళ్లు

రెండో వేరియంట్‌లో డ్యూయల్-మోటర్ ఆల్-వీల్-డ్రైవ్  మోటార్ కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ ధర  $49,900 (సుమారు రూ .35,81,000)ఇది 300 మైళ్ల వరకు సింగల్ చార్జ్ తో నడుస్తుంది. ఇది 10,000 పౌండ్ల ట్రక్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ట్రక్ 4.5 సెకన్లలో 0 నుండి 60 mph వేగాన్ని చేరుకోగలదు.


చివరగా  ట్రిపుల్ మోటర్ ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్, ఇది 500 మైళ్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ధర  $ 69,900 (సుమారు రూ .50,16,000) వద్ద లభిస్తుంది. ఇది 14,000 పౌండ్ల  సామర్ధ్యన్ని కలిగి ఉంటుంది, కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 60 స్పీడ్ చేరుకోగలదు. ఈ వేరియంట్ 2022 చివరి వరకు అందుబాటులో ఉండదని కంపెనీ పేర్కొంది.

also read  4 సంవత్సరాలలో మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు ఎంతో తెలుసా..?


సైబర్ ట్రక్  అన్ని ఫీచర్లతో రాబోతుంది. దీని లోపల ఆరుగురు వరకు కూర్చోగలరు. పేలోడ్ 3,500 పౌండ్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.  100 క్యూబిక్ ఫీట్ స్టోరేజ్  క్యపాసిటి కలిగి ఉంటుంది. దీని పొడవు 6.5-అడుగుల పొడవు, దీనికి రెండు వైపులా 4-అంగుళాల సస్పెన్షన్‌లు సపోర్ట్ గా ఉంటాయి.

ఈ ట్రక్ లోపల 17-అంగుళాల టచ్‌స్క్రీన్‌, డాష్‌ బోర్డ్ మధ్యలో అమర్చారు. ట్రక్ యొక్క  బాడీ అల్ట్రా-హార్డ్ 30 ఎక్స్ కోల్డ్-రోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడిందని కంపెనీ పేర్కొంది. ఈ మస్క్ ట్రక్కు లాంచ్ సమయంలో స్లెడ్జ్ హామర్తో మళ్లీ మళ్లీ కొట్టడం ద్వారా దీని ధృడత్వాన్ని ప్రదర్శించారు.