Asianet News TeluguAsianet News Telugu

4 సంవత్సరాలలో మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు ఎంతో తెలుసా..?

మొట్టమొదాటిగా బాలెనో కారు అక్టోబర్ 2015 లో ప్రారంభించబడింది. గత నెలలో మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 2019 మేలో 6 లక్షల యూనిట్ అమ్మకాల మైలురాయిని దాటినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే మిగిలిన 50,000 యూనిట్లు కేవలం 5 నెలల్లో అమ్ముడు పోయాయి అని చేప్పింది.
 

maruti suzuki  baleno car reaches record sales in 6 years.
Author
Hyderabad, First Published Nov 21, 2019, 3:46 PM IST

మారుతి సుజుకి ఇండియా 6.5 లక్షల అమ్మకాల మార్కును అధిగమించి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో కొత్త అమ్మకాల మైలురాయిని దాటిందని ప్రకటించింది. మొదటిసారి అక్టోబర్ 2015 లో బాలెనో  ప్రారంభించబడింది, గత నెలలో మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో 4 సంవత్సరాలు పూర్తి చేసి మొదటి సంవత్సరంలో లక్ష యూనిట్ అమ్మకాల మార్కును దాటి తరువాత లక్ష యూనిట్లు కేవలం 8 నెలల్లో అమ్ముడయ్యాయి.

తరువాత మరో లక్ష యూనిట్లు సుమారు 5 నెలల్లో విక్రయించబడింది. ఈ ఏడాది ఆరంభంలో 6 లక్షల యూనిట్ అమ్మకాల మైలురాయిని అధిగమించిందని కంపెనీ తెలిపింది. ఇక పోతే మిగిలిన 50,000 యూనిట్లు కేవలం 5 నెలల్లో రిటైల్ చేయబడ్డాయి, ఆటో పరిశ్రమలో అమ్మకాలు అంతంత మాత్రనే  ఉన్నప్పటికీ నెలకు సగటున 10 వేల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

also read  కేవలం నెలలోనే టాప్-10లో మారుతి ఎస్-ప్రెస్సోకు చోటు

నాల్గవ సంవత్సరం బెంచ్ మార్క్ గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ "బాలెనో ప్రారంభం నుండి టాప్ కారులో ఒకటిగా ఉంది. మా ప్రీమియం ఛానల్ నెక్సా నుండి రిటైల్ చేయబడిన బాలెనో మారుతి సుజుకి  కొత్త కస్టమర్లను ఆకర్షించింది.

maruti suzuki  baleno car reaches record sales in 6 years.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్న వారికి బాలెనో సరైన ఎంపిక. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి ఇంకా జోడించడానికి ఇది సంవత్సరాలుగా మా సంస్థ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఆకర్షణీయమైన ఫీచర్స్ బాలెనోను మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కోసం ఎక్కువగా కోరుకునే వాటిలో ముందుంతుంది. "

also read రాయల్ ఎన్ఫీల్డ్ ఆ మోడల్ బైకులను ఇక అమ్మకపోవచ్చు...


 ఈ సంవత్సరం ప్రారంభంలో మారుతి సుజుకి ఇండియా బాలెనో యొక్క మిడ్-లైఫ్ ఫేస్ లిఫ్ట్ను కారును విడుదల చేసింది. ఇది భారతదేశంలో సంస్థ నుండి విడుదలైన మొదటి బిఎస్ 6 పెట్రోల్ మోడల్  కారుగా నిలిచింది.ప్రస్తుతం ఈ కారు స్మార్ట్ హైబ్రిడ్ (ఎస్‌హెచ్‌విఎస్) టెక్నాలజీతో జత చేసిన రివైజ్డ్ బిఎస్ 6, 1.2-లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వివిటి బిఎస్ 6 ఇంజన్ మరియు రెగ్యులర్ 1.2-లీటర్ వివిటి పెట్రోల్ పొందుతుంది.

ప్రస్తుతానికి 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడా బాలెనోను అందిస్తున్నారు. అయితే బిఎస్ 6  నిబంధనలు ప్రారంభమయ్యే ముందు ఆయిల్ బర్నర్ దశలవారీగా తొలగించబడుతుందని మారుతి ధృవీకరించింది.గేర్ ట్రాన్స్మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో  వస్తుంది.ప్రస్తుతం, మారుతి సుజుకి బాలెనో ధర ₹ 5.58 లక్షల నుండి  8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, .ఢిల్లీ) ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios