వచ్చేనెల విపణిలోకి టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కార్

టాటా మోటార్స్ నుంచి విపణిలోకి మలి విడుత ఎలక్ట్రిక్ కారు నెక్సన్ వచ్చేనెల 16న అడుగు పెట్టనున్నది. టాటా నెక్సన్ విద్యుత్ కారులో వినియోగిస్తున్న జిప్ట్రాన్ ఈవీ టెక్నాలజీని టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారులో వాడనున్నది.

Tata Nexon EV likely to be unveiled on December 16, 2019

న్యూఢిల్లీ: దేశీయంగా కార్ల తయారీలో పేరొందిన ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ విపణిలోకి రెండో విద్యుత్ కారు ‘టాటా నెక్సన్ ఎలక్ట్రిక్’ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నెక్సన్ మోడల్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కారు వివరాలను వచ్చేనెల 16వ తేదీన వెల్లడించనున్నది. దీని ధర రూ.15-17 లక్షలు ఉంటుందని అంచనా. 

2020 ఆటో ఎక్స్ పోలో ‘టాటా నెక్సన్ ఎలక్ట్రిక్’ కారును ప్రదర్శించనున్నారు. దీన్ని ప్రైవేట్ వ్యక్తుల వినియోగానికి విక్రయించనున్నది టాటా మోటార్స్. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేసిన టాటా టిగోర్ విద్యుత్ వాహనాన్ని ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వాడుతున్నారు.

also read  భారతదేశపు ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్:గంటకు 140కి.మీ

టాటా నెక్సన్ విద్యుత్ కారును టాటా మోటార్స్ ఇప్పటికే 10 లక్షల కిలోమీటర్లకు పైగా పరీక్షించింది. ఈ కారు ప్రచారానికి ప్రముఖ మోడళ్లు మిలింద్ సోమన్, అంకిత నోవా పని చేయనున్నట్లు తెలిసింది. ఇటీవలే వీరు విద్యుత్ వాహనంలో మనాలీ నుంచి లేహ్ వరకు ప్రయాణించారు. ఈ కారులోని బ్యాటరీ ఒకసారి చార్జి చేసిన దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రూపొందించినట్లు వార్తలు వచ్చాయి.

Tata Nexon EV likely to be unveiled on December 16, 2019

టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కారు విడుదల కావడానికి ముందే చార్జింగ్ స్టేషన్లను మెరుగు పర్చాలని టాటా మోటార్స్ భావిస్తున్నది. ఇప్పటికే టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 13 పట్టణాల్లో 85 చార్జింగ్ స్టేషన్లు కలిగి ఉన్నది. ఐదు నగరాల్లో వీటిని విస్తరించి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 300కు పెంచాలని టాటా మోటార్స్ భావిస్తోది. వీటిల్లో ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. 

also read  యుటిలిటీలో తీవ్ర పోటీ: 7వేల కోట్లతో భారత్‌లోకి ‘గ్రేట్‌‍వాల్ మోటార్స్‌’‌?

జిప్ట్రాన్ ఈవీ టెక్నాలజీతో టాటా నెక్సన్ విద్యుత్ కారు రూపుదిద్దుకున్నది. ఈ కారులో వినియోగించే లిథియం ఐయాన్ సెల్స్‌తో బ్యాటరీ రూపొందించింది. కొనుగోలుదారులకు టాటా మోటార్స్ సంస్థ కారు, బ్యాటరీ ప్యాక్‌పై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది. నెక్సాన్ విద్యుత్ కారులో వాడే జిప్ట్రాన్ టెక్నాలజీని టాటా అల్ట్రోజ్ విద్యుత్ వెహికల్స్‌లోనూ వినియోగించనున్నారు. 

నెక్సన్ ఈవీ కారు దాని ప్రత్యర్థి సంస్థ మహీంద్రా ఎక్స్‌యూవీ 300 విద్యుత్ కారుతో గట్టిగా ఢీకొట్టనున్నది. మహీంద్రా ఎక్స్ యూవీ 300 కారు వచ్చే ఏడాది మధ్యలో విపణిలోకి అడుగు పెట్టనున్నది. టాటా నెక్సన్ అప్ డేటెడ్ వర్షన్ కారు కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios