Asianet News TeluguAsianet News Telugu

భారతదేశపు ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్:గంటకు 140కి.మీ

అల్ట్రావయొలెట్ f77 భారత దేశపు మొట్టమొదటి వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్. దీని టాప్ స్పీడ్  గంటకు 140 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. అల్ట్రావయొలెట్  ఎఫ్ 77 లైటెనింగ్, షాడో ఇంకా లేజర్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. 

Ultraviolette F77 Electric Motorcycle launches soon
Author
Hyderabad, First Published Nov 13, 2019, 4:26 PM IST

బెంగళూరుకు చెందిన టెక్ స్టార్ట్-అప్ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ సంస్థ మొట్ట మొదటి ఉత్పత్తి అయిన అల్ట్రావయొలెట్ F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఎఫ్ 77 లైటెనింగ్, షాడో ఇంకా లేజర్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 ఎయిర్-కూల్డ్ బ్రష్‌లెస్ డిసి (బిఎల్‌డిసి) మోటారుతో పనిచేస్తుంది.

ఇది 25 కిలోవాట్ల (33.5 బిహెచ్‌పి) ఉత్పత్తిని కలిగి ఉంటుంది. ఇది 147 కిలోమీటర్ల వేగవంతమైన స్పెడ్ ను అందుకోగలదు. కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని, 7.5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది.

Ultraviolette F77 Electric Motorcycle launches soon

 

అల్ట్రావయొలెట్ F77 ఎకో, స్పోర్ట్ మరియు ఇన్సేన్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. వెనుక  టైర్ లో 450 Nm భారీ టార్క్ రేటింగ్‌తో వస్తుంది. అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 ధర 3 లక్షల (ఆన్-రోడ్) వరకు ఉండొచ్చని అంచనా. 

aslo read యుటిలిటీలో తీవ్ర పోటీ: 7వేల కోట్లతో భారత్‌లోకి ‘గ్రేట్‌‍వాల్ మోటార్స్‌’‌?

F77 మూడు స్లిమ్, మాడ్యులర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జీతో 130-140 కిలోమీటర్ల మైలేజ్ ని ఇవ్వగలదు. స్టాండర్డ్  ఛార్జర్ నుండి 5 గంటల్లో బ్యాటరీ ప్యాక్‌లను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ రైడర్‌ను కేవలం 50 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.

90 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ ఛార్జర్ సాధారణ 5-ఆంపియర్ సాకెట్‌తో పనిచేస్తుంది అయితే ఫాస్ట్ ఛార్జర్‌కు 15-ఆంపియర్ పవర్ సాకెట్ అవసరం ఉంటుంది. అదనపు  బ్యాటరీలను రాత్రిపూట ఛార్జ్ చేయడానికి ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకోటానికి ఛార్జింగ్ పాడ్‌లు కూడా ఉన్నాయి.

Ultraviolette F77 Electric Motorcycle launches soon

బ్యాటరీ సిస్టంలో  ధృడమైన షాక్ ప్రూఫ్  కవరింగ్ ప్యాక్‌ మరియు IP67- రేటెడ్ కనెక్టర్లతో నిర్మించబడింది. ప్రతి బ్యాటరీ ప్యాక్ బరువు 8.5 కిలోలు ఉంటుంది. అల్ట్రావయొలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ అల్యూమినియం బల్క్ హెడ్‌తో స్ట్రీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.

aslo read హ్యుండాయ్ సరికొత్త సెడాన్ ‘అరా’...వ్యక్తిగత వినియోగదారులే టార్గెట్

దీనికి సస్పెన్షన్ విలోమ కార్ట్రిడ్జ్ టైప్ ఫ్రంట్ ఫోర్క్ తో పనిచేస్తుంది. బ్రేకింగ్ 320 mm ఫ్రంట్ డిస్క్, 230 mm వెనుక డిస్క్, డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది.అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్-కలర్ టిఎఫ్‌టి స్క్రీన్, ఇన్ బిల్ట్ యాప్ అప్‌డేట్స్, రిమోట్ డయాగ్నస్టిక్స్, బైక్ లొకేటర్, రైడ్ ఎనాలిసిస్ ఫీచర్‌లతో కూడిన ప్రత్యేకమైన యాప్ తో సహా అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

స్పెడ్ లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు అలాగే టార్క్ డెలివరీ కంట్రోలర్ కూడా ఉంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మరియు డయాగ్నస్టిక్స్ సిస్టమ్ చెక్, స్కాన్ డయాగ్నస్టిక్‌లతో ఏదైనా సర్వీస్  సమస్యలను ముందే తెలియజేస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios