వోక్స్ వేగన్ యజమాన్యంలోని ఆటోమోబైల్ దిగ్గజం స్కోడా తాజాగా ఆవిష్కరించిన స్కోడా కుషాక్ ఎస్‌యూవీ బుకింగ్‌లు జూన్ నుంచి ఇండియాలో ప్రారంభంకానున్నాయి. అలాగే జూలై నుండి డెలివరీలు అందించనున్నారు.  స్కోడా కుషాక్ ఎస్‌యూవీ యాక్టివ్, అంబిషన్, స్టైల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

ఈ కారులోని హైలెట్స్ చూస్తే స్పోర్టి లుక్, అనేకమైన లేటెస్ట్ ఫీచర్లతో కూడిన విశాలమైన క్యాబిన్ ఉంది. స్కోడా కుషాక్  రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో అందించనున్నారు.

స్కోడా కుషాక్ కి బటర్ ఫ్లయి గ్రిల్, మస్కులర్ బోనెట్, బంపర్ హౌసింగ్ ఫాగ్ లాంప్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్, డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌లైట్‌లను ఉంటాయి.

దీని పైకప్పు పై రైల్స్, బ్లాక్-అవుట్ బి-పిల్లర్స్, ఓ‌ఆర్‌వి‌ఎంలు, 16/17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. విండో వైపర్, బూమేరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్ఈడి టైల్ లాంప్స్  వెనుక విభాగాన్ని ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ స్కోడా కుషాక్ ఎస్‌యూవీని హనీ ఆరెంజ్, వైట్, కార్బన్ స్టీల్, సిల్వర్,  స్టోర్మ్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.

also read ఖరీదైన కార్లు, 3.5 కోట్ల వాచీ ధరించిన ఈ ఫుట్ బాల్ ప్లేయర్ లగ్జరీ లైఫ్, సంపద గురించి తెలిస్తే షాకవుతా...

స్కోడా కుషాక్ రెండు ఇంజన్ల ఎంపికతో వస్తుంది. ఒకటి 113హెచ్‌పి / 175ఎన్‌ఎం ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్,  148హెచ్‌పి / 250ఎన్‌ఎం అందించే  1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్  అందించారు.

స్కోడా కుషాక్ లో సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్‌తో విశాలమైన డ్యూయల్ టోన్ క్యాబిన్ లభిస్తుంది.

దీనిలో 10.0-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.0-అంగుళాల 'ఫ్లోటింగ్' టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌  ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో,  మై స్కోడా కనెక్ట్ యాప్ కి సపోర్ట్  చేస్తుంది.

ఈ కారులో ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా అందించారు.

భారతదేశంలో స్కోడా కుషాక్ ఎస్‌యూవీ ధర, లభ్యతకు సంబంధించిన వివరాలు లాంచ్ సమయంలో వెల్లడించనున్నారు. అయితే దీని ధర సుమారు రూ. 10 లక్షలు  ఉండొచ్చని భావిస్తున్నారు, రెనాల్ట్ డస్టర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ కిక్స్ వంటి కార్లతో స్కోడా కుషాక్ పోటీగా నిలుస్తుంది.