కొత్త కలర్స్ ఆప్షన్స్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. లుక్, స్టయిల్ అదిరిందిగా.. ధర ఎంతో తెలుసా..?

 కొత్త హిమాలయన్ కోసం ఇండియాలోని అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టోర్‌లలో బుకింగ్‌లు అండ్ టెస్ట్ రైడ్‌లు మొదలయ్యాయి. కంపెనీ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర చెన్నైలో రూ.2,15,900 ఎక్స్-షోరూమ్ గా నిర్ణయించింది. 

Royal Enfield Himalayan launched in new colors, know the price and features

ఇండియన్ ఆటోమోబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ త్రీ బాడీ పెయింట్ ఆప్షన్స్ తో హిమాలయన్ బైక్ ని పరిచయం చేసింది. ఈ అడ్వెంచర్-టూరింగ్ బైక్ ని ప్రస్తుతం ఉన్న గ్రావెల్ గ్రే, పైన్ గ్రీన్, గ్రానైట్ బ్లాక్‌ కలర్స్ కి అదనంగా గ్లేసియర్ బ్లూ, స్లీట్ బ్లాక్, డ్యూన్ బ్రౌన్ కలర్స్ తీసుకొచ్చారు. రైడర్ మానియా 2022లో ప్రదర్శించిన హిమాలయన్ గ్రిల్ అండ్ సైడ్ ప్యానెల్‌లపై ఎంబోస్డ్ లోగోలు, USB ఛార్జింగ్ పోర్ట్‌ లభిస్తుంది.

 కొత్త హిమాలయన్ కోసం ఇండియాలోని అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టోర్‌లలో బుకింగ్‌లు అండ్ టెస్ట్ రైడ్‌లు మొదలయ్యాయి. కంపెనీ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర చెన్నైలో రూ.2,15,900 ఎక్స్-షోరూమ్ గా నిర్ణయించింది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్  డూన్ బ్రౌన్ కలర్ ఆప్షన్ ధర ఢిల్లీలో రూ. 2,22,400 ఉండగా, స్లీట్ బ్లాక్ అండ్ గ్లేసియర్ బ్లూ ధర రూ.2,23,900. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మొదటిసారిగా 2016లో ప్రవేశపెట్టబడినప్పటి నుండి అడ్వెంచర్ బైక్ కోసం వెతుకుతున్న బైకర్లు అండ్ రైడర్‌లకు హిమాలయన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సిఇఒ బి గోవిందరాజన్ కొత్త కలర్స్ లాంచ్ చేయడంపై మాట్లాడుతూ “రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ పర్వతాలలో రైడ్ చేయడం, కొన్ని కఠినమైన భూభాగాలను దాటడం వంటి అనుభవంతో అభివృద్ధి చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైడర్‌ల కోసం సింపుల్‌గా  వెళ్లగలిగే బైక్ అడ్వెంచర్ టూరింగ్‌లో కొత్త సెగ్మెంట్‌ను రూపొందించినట్లు హిమాలయన్ పేర్కొంది. 

ఇంజిన్ అండ్ పవర్
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ కొత్త కలర్ ఆప్షన్‌తో పాటు మరే ఇతర అప్‌డేట్‌లను అందుకోలేదు. ఈ బైక్ 411cc, ఎయిర్ కూల్డ్, SOHC ఇంజిన్‌  పొందుతుంది. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 24.3 bhp శక్తిని, 4,000-4,500 rpm వద్ద 32 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో కంస్టంట్ మెష్ 5-స్పీడ్ గేర్‌బాక్స్  ఉంది. 

ఫీచర్లు
ఈ అడ్వెంచర్ టూరర్ బైక్‌కు ముందువైపు 320ఎం‌ఎం డిస్క్ బ్రేక్ (2 పిస్టన్ కాలిపర్‌తో), వెనుక వైపు 240ఎం‌ఎం డిస్క్ (సింగిల్ పిస్టన్‌తో) ఉంటుంది.  రెట్రో డిజైన్  సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌  కూడా పొందుతుంది. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 ఎం‌ఎం.  స్టాండర్డ్‌గా డ్యూయల్-ఛానల్  ABSని పొందుతుంది. ఈ బైక్ 15 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయల్ ట్యాంక్‌ ఉంటుంది, బైక్ బరువు 199 కిలోలు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో తాజాగా విడుదలైన బైక్స్ లో హంటర్ 350, క్లాసిక్ 350, మెటియోర్ 350 క్రూయిజర్, 650 పారలెల్ ట్విన్ బైక్ - ఇంటర్‌సెప్టర్ అండ్ కాంటినెంటల్ GT, హిమాలయన్ అడ్వెంచర్ టూరర్, స్క్రామ్ 411 ADV క్రాస్ఓవర్, బుల్లెట్ 350 ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios